News November 8, 2024
ట్రంప్ క్యాబినెట్లోకి మస్క్?
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయంలో కీలకపాత్ర పోషించిన ఎలాన్ మస్క్‌కు క్యాబినెట్ పదవి కన్ఫర్మ్ అని తెలుస్తోంది. అలాగే ఇండో-అమెరికన్లు వివేక్ రామస్వామి, కశ్యప్ పటేల్, బాబీ జిందాల్, నిక్కీ హేలీకి చోటు దక్కనున్నట్లు సమాచారం. తులసీ గబ్బార్డ్, మైక్ పాంపియో, బ్రూక్ రోలిన్స్, మార్కో రూబియో, రాబర్ట్ F.కెన్నడీ Jr, మైక్ వాల్ట్జ్, మిల్లర్లను ట్రంప్ తన క్యాబినెట్లోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.
Similar News
News November 8, 2024
APPLY NOW: 457 ప్రభుత్వ ఉద్యోగాలు
UPSC ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్-2025కు ఈ నెల 22 వరకు అప్లై చేసుకోవచ్చు. రైల్వే, టెలికం, డిఫెన్స్ లాంటి కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 457 పోస్టులను భర్తీ చేస్తారు. బీఈ/బీటెక్ పూర్తైన 21-30 ఏళ్లలోపు వారు దరఖాస్తుకు అర్హులు. నవంబర్ 23 నుంచి 29 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష వచ్చే ఏడాది జూన్ 8న రెండు సెషన్లలో జరుగుతుందని తాజాగా UPSC ప్రకటించింది.
వెబ్సైట్: <
News November 8, 2024
నేడు మలేషియాకు KTR
TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఇవాళ మలేషియా పర్యటనకు వెళ్లనున్నారు. మలేషియా తెలంగాణ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. తెలంగాణ ఏర్పాటైన 2014లో ఈ అసోసియేషన్‌ను KCR ప్రారంభించారు. ఈ నేపథ్యంలో దశాబ్ది వేడుకల్లో పాల్గొనాలని నిర్వాహకులు ఆహ్వానించడంతో KTRతో పాటు జగదీశ్ రెడ్డి, గోరటి వెంకన్న, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్ కుమార్, బాల్క సుమన్ బయల్దేరుతున్నారు.
News November 8, 2024
‘వైట్‌హౌస్’ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా మహిళను నియమించిన ట్రంప్
అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ పదవుల భర్తీపై దృష్టి పెట్టారు. తాజాగా ‘వైట్‌హౌస్’ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా సూసీ వైల్స్‌ను నియమించారు. ఓ మహిళ ఈ బాధ్యతలు చేపట్టడం వైట్‌హౌస్ చరిత్రలో ఇదే తొలిసారి. ట్రంప్ విజయంలో ఆమె కీలకపాత్ర పోషించారు. ‘సూసీ ఎంతో తెలివైనవారు. వినూత్నంగా ఆలోచిస్తారు. అమెరికాను మరోసారి ఉన్నత స్థానంలో నిలపడానికి ఆమె శక్తివంచన లేకుండా పనిచేస్తారు’ అని ట్రంప్ ప్రశంసలు కురిపించారు.