News November 23, 2024

అమెరికా టీవీ ఛానల్ కొనుగోలు చేయనున్న మస్క్?

image

అపర కుబేరుడు ఎలాన్ మస్క్ అమెరికాకు చెందిన ప్రముఖ న్యూస్ ఛానల్ MSNBCని కొనుగోలు చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. MSNBC అమ్మకానికి ఉందన్న ఓ పోస్టుకు జూనియర్ ట్రంప్ స్పందిస్తూ మస్క్‌ను అడిగారు. దీనిని ఎంతకు అమ్ముతున్నారంటూ ఆయన రిప్లై ఇచ్చారు. ప్రముఖ పాడ్‌కాస్టర్ జో రోగన్ కూడా ఇది ఓకే అయితే తాను ఓ షో చేస్తానని చెప్పడంతో దీనిని తప్పకుండా చేయాలంటూ జూ.ట్రంప్ చెప్పడంతో డీల్ డన్ అంటూ మస్క్ హామీ ఇచ్చారు.

Similar News

News December 4, 2024

కీర్తి సురేశ్ పెళ్లి డేట్ ఫిక్స్.. వెడ్డింగ్ కార్డ్ వైరల్

image

మహానటి కీర్తి సురేశ్, తన ప్రియుడు అంథోనీని పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 12న వీరి పెళ్లి అని ఓ వెడ్డింగ్ కార్డ్ వైరలవుతోంది. కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరుగుతుందని సమాచారం. ఇటీవల కీర్తి తన కుటుంబసభ్యులతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

News December 4, 2024

బాలయ్య కొత్త గెటప్ చూశారా?

image

పాత్ర ఏదైనా తన పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టడం బాలయ్యకు వెన్నతో పెట్టిన విద్య. అన్‌స్టాపబుల్‌ షోలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బాలయ్య వ్యోమగామి లుక్‌లో కనిపించారు. దీంతో ఆదిత్య 369 సీక్వెల్‌కి బాలయ్య హింట్ ఇచ్చారంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు గతంలో బాలయ్యకు ఈ మూవీ సీక్వెల్‌ను తన కుమారుడు మోక్షజ్ఞతో తీస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తాజా గెటప్ చర్చనీయాంశంగా మారింది.

News December 4, 2024

ఈ నెల 11న జిల్లాల్లో వైసీపీ నిరసనలు: జగన్

image

AP: ఈ నెల 11న రైతు సమస్యలపై వైసీపీ జిల్లా స్థాయిలో ర్యాలీలు నిర్వహిస్తుందని వైసీపీ చీఫ్ జగన్ తెలిపారు. ప్రజల తరఫున గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని మీడియా సమావేశంలో తెలిపారు. కరెంట్ ఛార్జీల బాదుడును నిరసిస్తూ ఈ నెల 27న ఆందోళన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయమై జనవరి 3న కలెక్టర్ల వద్ద నిరసన చేపడుతామని చెప్పారు.