News April 28, 2024
చైనా పర్యటనకు వెళ్లిన మస్క్.. అందుకేనా?

భారత్‌లో పర్యటనను వాయిదా వేసుకున్న టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ చైనా పర్యటనకు వెళ్లారు. బీజింగ్‌లో పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఆయన భేటీ కానున్నారట. చైనాలో టెస్లా కార్ల విక్రయాలు పడిపోవడం, ఇటీవల కార్ల ధరలను కంపెనీ తగ్గించిన నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ దేశంలో ‘ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్’ వ్యవస్థను ప్రవేశపెట్టడం, కస్టమర్ల డేటా బదిలీ వంటి అంశాలపై ఆయన చర్చలు జరపనున్నారట.
Similar News
News December 1, 2025
హైదరాబాద్ NGRIలో ఉద్యోగాలు

HYDలోని CSIR-<
News December 1, 2025
రెండో పెళ్లి చేసుకున్న సినీ ప్రముఖులు వీరే..

సినీ ఇండస్ట్రీలో విడాకులు, పలు కారణాలతో రెండో పెళ్లి చేసుకోవడం కామన్‌గా మారింది. రెండో పెళ్లి చేసుకున్న సినీ ప్రముఖుల జాబితాలో తాజాగా హీరోయిన్ <<18437680>>సమంత<<>> చేరారు. ఈ లిస్టులో సీనియర్ NTR, సూపర్ స్టార్ కృష్ణ, నాగార్జున, హరికృష్ణ, మోహన్ బాబు, మంచు మనోజ్, నాగ చైతన్య, అమలాపాల్, నిర్మాత దిల్ రాజు ఉన్నారు. పవన్ కళ్యాణ్, నటుడు నరేశ్, నటి రాధిక మూడో పెళ్లి చేసుకున్న వారి లిస్టులో ఉన్నారు.
News December 1, 2025
నుదురు వెనక్కి వెళ్లిపోతోందా?

ప్రస్తుతం చాలామంది ఎదుర్కొనే సమస్య హెయిర్ లైన్ రిసీడింగ్. అంటే నుదుటిపై జుట్టు వెనక్కి వెళ్లిపోవడం. దీనివల్ల లుక్ మొత్తం మారిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొప్పు గట్టిగా వేయడం, పాపిడి ఎప్పుడూ ఒకవైపే తీయడం వంటివి చేయకూడదు. అప్పుడు వెంట్రుకలపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. ఇలా జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. అలానే మీరు జుట్టు వేసుకొనేటప్పుడు లూజ్‌గా వెయ్యడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.


