News April 28, 2024

చైనా పర్యటనకు వెళ్లిన మస్క్.. అందుకేనా?

image

భారత్‌లో పర్యటనను వాయిదా వేసుకున్న టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ చైనా పర్యటనకు వెళ్లారు. బీజింగ్‌లో పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఆయన భేటీ కానున్నారట. చైనాలో టెస్లా కార్ల విక్రయాలు పడిపోవడం, ఇటీవల కార్ల ధరలను కంపెనీ తగ్గించిన నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ దేశంలో ‘ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్’ వ్యవస్థను ప్రవేశపెట్టడం, కస్టమర్ల డేటా బదిలీ వంటి అంశాలపై ఆయన చర్చలు జరపనున్నారట.

Similar News

News April 16, 2026

ప్రపంచంలోనే అతిపొడవైన ముక్కు ఈయనదే!

image

18వ శతాబ్దానికి చెందిన బ్రిటిష్ సర్కస్ కళాకారుడు థామస్ వాడ్‌హౌస్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన ముక్కును కలిగి ఉండేవారు. ఆయన ముక్కు 19cms(7.5inch) పొడవు ఉండేది. గిన్నిస్ రికార్డ్స్ ప్రకారం మానవ చరిత్రలోనే ఇదే అత్యధికం. ఈ అరుదైన రూపాన్ని గౌరవిస్తూ ‘రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్’ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని నేటికీ ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(47/100)

News April 16, 2026

IPL: రెండు మ్యాచులకు రోహిత్ శర్మ దూరం?

image

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల RCBతో మ్యాచులో గాయపడిన సంగతి తెలిసిందే. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ఆయన ముంబై ఆడబోయే తర్వాతి రెండు మ్యాచులకు దూరం అయ్యే అవకాశం ఉందని NDTV పేర్కొంది. ఇప్పటికే వరుసగా 3 మ్యాచుల్లో ఓడిన ఆ జట్టుకు హిట్‌మ్యాన్ దూరమవడం పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. కాగా MI రేపు PBKS, ఈ నెల 20న GTతో తలపడనుంది.