News November 5, 2024
మస్క్ రాసిన ఫిజిక్స్ నోట్ వైరల్
అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతునిస్తూ ప్రచారంలో హోరెత్తించిన కుబేరుడు ఎలాన్ మస్క్ కాలేజీ టైమ్‌లో రాసిన నోట్ బుక్ పేజీలు వైరలవుతున్నాయి. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ఆయన ఫిజిక్స్ హోమ్‌వర్క్ ఎలా చేశారో చూపుతూ ఓ వ్యక్తి సదరు ఫొటోలను Xలో పంచుకున్నారు. దీనికి మస్క్ స్పందిస్తూ మూమెంట్స్ ఆఫ్ ఇనర్షియా డెరివేషన్‌లోని కొన్ని పేజీలు లేవని రిప్లై ఇవ్వడంతో వాటినీ అతను పంచుకున్నారు.
Similar News
News December 9, 2024
సిరియాపై భారత ప్రభుత్వ కీలక ప్రకటన
సిరియాలో పరిస్థితుల్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఐక్యత, సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రతను కాపాడేందుకు ఆ దేశంలోని అన్ని వర్గాలూ కలిసి పనిచేయాలని సూచించింది. ‘అన్ని వర్గాల ఆకాంక్షలు, ప్రయోజనాలను గౌరవిస్తూ సమ్మిళిత సిరియా నాయకత్వంలో రాజకీయ ప్రక్రియ శాంతియుతంగా సాగాలని మేం కోరుకుంటున్నాం’ అని MEA తెలిపింది. అక్కడి భారతీయులంతా క్షేమంగా ఉన్నారని వెల్లడించింది.
News December 9, 2024
బీజేపీ నుంచి రాజ్యసభకు కృష్ణయ్య
మూడు రాజ్యసభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఏపీ నుంచి కృష్ణయ్య, హరియాణా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజీత్ కుమార్ పేర్లను ఖరారు చేసింది. బీసీ ఉద్యమ నేత కృష్ణయ్య ఇటీవల వైసీపీకి, రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బీజేపీ ఆయనకు మరోసారి అవకాశం కల్పించింది.
News December 9, 2024
గ్రూప్-2 పరీక్ష వాయిదాకు హైకోర్టులో పిటిషన్
TG: గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈనెల 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలను నిర్వహించనున్నట్లు TGPSC ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే 16వ తేదీన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ కూడా ఉండటంతో గ్రూప్-2ను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.