News February 22, 2025

మస్క్ కుమారుడి పని.. 145 ఏళ్ల టేబుల్‌ను మార్చిన ట్రంప్

image

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కార్యాలయంలో ఇటీవల మస్క్ తన బిడ్డతో సహా ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఆ సమయంలో మస్క్ కుమారుడు ముక్కులో వేళ్లు పెట్టుకోవడం, బల్లపై చేతులు పెట్టడం వంటి పనులు చేశాడు. ట్రంప్‌కు క్రిముల్ని చూస్తే భయపడే లక్షణం ఉంది. ఈ నేపథ్యంలో ఆ డెస్క్‌ను తీయించేశారు. తాత్కాలికంగా కొత్త డెస్క్‌ ఏర్పాటు చేసిన విషయాన్ని మస్క్ బిడ్డ పేరు చెప్పకుండా ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో తెలిపారు.

Similar News

News March 19, 2025

చేనేత కార్మికులకు అవార్డులు.. దరఖాస్తు ఇలా

image

TG: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు ‘కొండా లక్ష్మణ్ బాపూజీ’ పేరుతో అవార్డులు ప్రదానం చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 నాటికి చేనేతలుగా 30yrs వయసు, పదేళ్ల అనుభవం, చేనేత డిజైనర్లుగా 25yrs వయసు, ఐదేళ్ల అనుభవం ఉన్నవారు అర్హులు. ఏప్రిల్ 15లోగా ఆయా జిల్లా చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకులకు దరఖాస్తులను సమర్పించాలి. పూర్తి వివరాలకు https://handtex.telangana.gov.in/ చూడండి.

News March 19, 2025

టెన్త్ పరీక్షలు రాసేవారికి అలర్ట్

image

TG: ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే టెన్త్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి ప్రశ్నాపత్రంపై క్యూఆర్ కోడ్‌తో పాటు సీరియల్ నంబర్‌ను ముద్రిస్తున్నారు. 24 పేజీల ఆన్సర్ బుక్‌లెట్ ఇవ్వనున్నారు. అదనపు షీట్లు ఇవ్వరు. ఉ.9.30 గం.కు పరీక్ష ప్రారంభం కానుండగా 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తారు. హాల్ టికెట్లు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.

News March 19, 2025

అంతరిక్షం ఎంత ఎత్తులో ఉంటుందంటే?

image

భూమిపై ఎత్తును, లోతును కొలిచేందుకు సముద్ర మట్టాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ సముద్రమట్టానికి 100 కి.మీ లేదా 62 మైళ్ల ఎత్తు తర్వాత రోదసి(అంతరిక్షం) మొదలవుతుందని చాలా దేశాలు చెబుతున్నాయి. నాసా మాత్రం 80km నుంచే అంతరిక్షం మొదలవుతుందని అంటోంది. అయితే ఎక్కడి నుంచి మొదలవుతుందనే విషయమై ప్రామాణిక కొలమానమేమీ లేదు. 2009లో కాల్గరీ యూనివర్సిటీ పరిశోధకులు 118KM ఎత్తులో రోదసి మొదలవుతుందని తేల్చారు.

error: Content is protected !!