News April 18, 2024
భారత్ గురించి మస్క్ ట్వీట్.. US రియాక్షన్
X(ట్విటర్) అధినేత మస్క్ ఈ నెలలో భారత్‌కు రానున్న నేపథ్యంలో గతంలో ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘అత్యధిక జనాభా ఉన్న భారత్‌కు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేదు. ఆఫ్రికా దేశాలన్నింటికీ కలిపి వీటో అధికారం ఉండాలి. శక్తిమంతమైన దేశాలు వాటి పవర్‌ను వదులుకోవడానికి ఇష్టపడటం లేదు’ అని అన్నారు. దీనిపై US ప్రతినిధి తాజాగా స్పందిస్తూ UN వ్యవస్థలో సంస్కరణలకు తాము అనుకూలంగా ఉన్నామన్నారు.
Similar News
News September 8, 2024
నా X అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు: బ్రహ్మాజీ
వైసీపీ చీఫ్ జగన్‌ను ట్యాగ్ చేస్తూ చేసిన <<14049130>>ట్వీట్<<>> వైరలవ్వడంపై నటుడు బ్రహ్మాజీ స్పందించారు. తన X అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేసినట్లు పేర్కొన్నారు. ఆ ట్వీట్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని, దీనిపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
News September 8, 2024
జాగ్రత్త.. ఇవాళ, రేపు అతిభారీ వర్షాలు
తెలంగాణలో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతవారణ కేంద్రం తెలిపింది. ఇవాళ జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. నిన్న MHBD, ఖమ్మం, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.
News September 8, 2024
రేపు 400 గ్రామాలకు రూ.లక్ష చొప్పున విరాళం: నాదెండ్ల
AP: వరదల్లో చిక్కుకున్న 6 జిల్లాల్లోని 400 గ్రామ పంచాయతీలకు ₹లక్ష చొప్పున రేపు విరాళం అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పంచాయతీలను ఆదుకునేందుకు dy.cm పవన్ సొంత నిధుల నుంచి ₹4 కోట్లు కేటాయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన శ్రేణులు, కూటమి నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మొత్తాన్ని గ్రామాల అభివృద్ధి, ఆస్తుల పరిరక్షణ, పారిశుద్ధ్యం, ఆరోగ్య శిబిరాలకు వినియోగించాలని సూచించారు.