News April 24, 2024
నేహ ఫ్యామిలీకి సంఘీభావంగా ముస్లింల ర్యాలీ

కర్ణాటక హుబ్బళ్లిలో ఎంసీఏ విద్యార్థిని నేహా హిరేమఠ్ హత్యను ఖండిస్తూ నిన్న ముస్లింలు పెద్దసంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. వారు నిర్వహించే దుకాణాలను ఒక పూట మూసివేసి, నేహ కుటుంబానికి సంఘీభావం ప్రకటించారు. నిందితుడు ఫయాజ్ను శిక్షించి, నేహ కుటుంబానికి న్యాయం చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. మరోవైపు ఈ కేసును సీఐడీకి బదిలీ చేస్తున్నట్లు కర్ణాటక సీఎం సిద్దరామయ్య ప్రకటించారు.
Similar News
News October 24, 2025
వంటింటి చిట్కాలు

* పకోడీలు చేసేటప్పుడు పిండిలో కొంచెం సోడా కలిపితే అవి బాగా పొంగుతాయి.
* వెల్లుల్లిని దంచి నీటిలో కలిపి.. బొద్దింకలు ఎక్కువగా ఉండే చోట పెడితే వాటి బారి నుంచి తప్పించుకోవచ్చు.
* కూరలో నూనె ఎక్కువైతే రెండు బ్రెడ్ ముక్కలను పొడి చేసి వేయడం వల్ల నూనెను పీల్చుకోవడంతో పాటు, కూర రుచిగా ఉంటుంది.
* చేతులకు కొబ్బరినూనె రాసుకొని పచ్చిమిర్చి కోస్తే, చేతులు మండవు.
News October 24, 2025
స్వాతి కార్తె అంటే ఏంటి?

27 నక్షత్రాల ఆధారంగా రైతులు ఏర్పరచుకున్న కార్తెల్లో ఇదొకటి. సూర్యుడు స్వాతి నక్షత్రానికి దగ్గరగా ఉన్న సమయాన్ని ఈ కార్తె సూచిస్తుంది. ఇది OCT 24 నుంచి NOV 6 వరకు ఉంటుంది. ఈ కార్తెలో పడే వర్షాలను ‘స్వాతి వానలు’ అంటారు. ఈ వర్షాలు వరికి ప్రతికూలం. మెట్ట పంటలకు అనుకూలం. ‘చిత్త చిత్తగించి, స్వాతి చల్లజేసి’ అనే సామెత ఈ వర్షాల ప్రాముఖ్యతను తెలుపుతుంది. వరి కోతలు, రబీ జొన్న సాగు పనులు ఇప్పుడు మొదలవుతాయి.
News October 24, 2025
ఇక ఇంటర్ ఫస్టియర్లోనూ ప్రాక్టికల్స్

TG: ఇంటర్ విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చేలా బోర్డు ప్రతిపాదనలకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటివరకు సెకండియర్కు మాత్రమే ప్రాక్టికల్స్ ఉండేవి. వచ్చే ఏడాది నుంచి ఫస్టియర్ విద్యార్థులకు సైతం ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. అన్ని సబ్జెక్టుల్లో 80% రాత పరీక్ష, 20% మార్కులు ఇంటర్నల్స్కు కేటాయిస్తారు. ఇంటర్లో కొత్తగా ACE(ఎకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్) గ్రూపును ప్రవేశ పెట్టనున్నారు.


