News August 7, 2024

గెలవాల్సిందే..

image

ఇవాళ భారత్, శ్రీలంక మధ్య మూడో వన్డే జరగనుంది. తొలి వన్డే టై కాగా రెండో వన్డేలో SL విజయం సాధించింది. సిరీస్ సమం కావాలంటే మూడో వన్డేలో భారత్ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఫలితం మారితే సిరీస్ శ్రీలంక వశం కానుంది. రోహిత్ మినహా మిగతా బ్యాటర్లు రాణించలేకపోవడం భారత జట్టును ఆందోళన కలిగిస్తోంది. ఈ మ్యాచులోనైనా సత్తా చాటి విజయాన్ని అందించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Similar News

News September 19, 2024

జమిలికి గ్రీన్ సిగ్నల్.. ఎన్నికలు ఎప్పుడంటే?

image

జమిలి ఎన్నికలను కేంద్రం ఆమోదించడంతో ఎన్నికలు ఎప్పుడొస్తాయనే ప్రశ్న నెలకొంది. ఈ విధానం 2029 నుంచి అమల్లోకి రానుందని సమాచారం. అప్పుడు లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. అయితే దేశంలోని 17 రాష్ట్రాల్లో 2026, 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. 2029లో జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు రెండు, మూడేళ్లే అధికారంలో ఉంటాయి.

News September 19, 2024

తరగతి గదిలోకి టీచర్లు ఫోన్ తీసుకెళ్తే కఠిన చర్యలు

image

TG: క్లాస్ రూమ్‌లోకి సెల్‌ఫోన్ తీసుకెళ్లొద్దనే ఆదేశాలున్నా కొందరు టీచర్ల తీరు మారట్లేదు. ఇటీవల కలెక్టర్ల ఆకస్మిక తనిఖీల్లో పలువురు ఉపాధ్యాయులు సెల్‌ఫోన్‌లోనే సమయం గడుపుతూ కనిపించారు. దీంతో విద్యాశాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. తరగతి గదిలోకి ఫోన్ తీసుకెళ్లొద్దని, అత్యవసరమైతే HM అనుమతి తీసుకోవాలని పేర్కొంది. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

News September 19, 2024

కౌలు రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

image

AP: కౌలు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూయజమాని సంతకం లేకుండానే వచ్చే రబీ నాటికి కౌలు కార్డులను ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది. దీనివల్ల కౌలు రైతులకు బ్యాంకుల ద్వారా పంట రుణాలు ఇప్పించడం, ప్రభుత్వ సబ్సిడీలు, పరిహారాలు అందించడం మరింత సులువవుతుంది. అదే సమయంలో రైతుల భూమి హక్కులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోనుంది. వారిలో ఉన్న అపోహలు తొలగించనుంది.