News April 18, 2024
కింద పడటంతో నా బ్రెయిన్ దెబ్బతినింది: హీరోయిన్ తానీషా ముఖర్జీ
తన మొదటి సినిమా షూటింగ్‌లో కొండ మీద నుంచి కింద పడిపోవడంతో తలకు బలమైన గాయమైందని హీరోయిన్ తానీషా ముఖర్జీ వెల్లడించారు. దీంతో బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఆ బాధతోనే షూటింగ్ పూర్తి చేశా. 2 గంటలు షూటింగ్ చేస్తే 3 గంటలు పడుకునేదాన్ని. సాధారణ స్థితికి రావడానికి ఏడాది పట్టింది’ అని తెలిపారు. ఈమె తెలుగులో కంత్రి సినిమాలో ఎన్టీఆర్ సరసన సెకండ్ హీరోయిన్‌గా చేశారు.
Similar News
News September 17, 2024
జానీని ‘మాస్టర్’ అని పిలవొద్దు: హీరోయిన్
డాన్స్ కొరియోగ్రాఫర్ జానీపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందించారు. ‘ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ జానీని ఇక నుంచి మాస్టర్ అని పిలవొద్దు. ‘మాస్టర్’ అనే పదానికి కాస్త గౌరవం ఇవ్వండి’ అని ట్వీట్ చేశారు. జానీ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ఓ యువతి ఆయన తనను లైంగికంగా వేధించాడని, అత్యాచారం చేశాడని రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
News September 17, 2024
నేడు సమీక్షలతో బిజీగా సీఎం చంద్రబాబు
AP: సీఎం చంద్రబాబు ఇవాళ పలు శాఖలపై సమీక్షలు నిర్వహించనున్నారు. నూతన ఎక్సైజ్ పాలసీ, బీసీ వెల్ఫేర్, హ్యాండ్లూమ్స్, టెక్స్ టైల్స్ శాఖలపై మంత్రులు, అధికారులతో సమీక్షించనున్నారు. అలాగే భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలకు అందించే సాయంపై నేడు సాయంత్రం కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
News September 17, 2024
మోదీ @ 74: పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ
ప్రధాని నరేంద్రమోదీ నేడు 74వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయా రాష్ట్రాల CMలు, కేంద్ర మంత్రులు, BJP నేతలు, ఫ్యాన్స్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ‘భరతమాత ముద్దుబిడ్డ, విజనరీ లీడర్, పీఎం మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. బలమైన, సంపన్నమైన భారత్‌ను నిర్మించాలన్న మీ విజన్ అందరి హృదయాల్లో ధ్వనిస్తోంది. అంకితభావంతో దేశాన్ని అభివృద్ధి చేసి భవిష్యత్తు తరాలకు ప్రేరణనివ్వాలి’ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.