News August 7, 2024
మోదీ వల్ల నా దేశం భద్రం: బీజేపీ శ్రేణులు
బంగ్లాదేశ్ అస్థిరత అనంతరం బీజేపీ కార్యకర్తలు ప్రధాని మోదీని కొనియాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పాక్, బంగ్లా, శ్రీలంక రాజకీయంగా అట్టుడుకుతున్నాయని, చైనా మాంద్యాన్ని ఎదుర్కొంటోందని చెబుతూ పోస్టర్లు షేర్ చేస్తున్నారు. మోదీ పాలన కారణంగా భారత్ భద్రంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, భారత్‌లో అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయంటూ విపక్ష పార్టీల శ్రేణులు వారికి కౌంటర్ ఇస్తున్నాయి.
Similar News
News December 12, 2024
పెళ్లి పీటలెక్కిన హీరోయిన్ కీర్తి సురేశ్
హీరోయిన్ కీర్తి సురేశ్ తన ప్రియుడు ఆంటోనీ తట్టిల్‌ను గోవాలో పెళ్లాడారు. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్న ఆమె ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య ఈ వేడుక గ్రాండ్‌గా జరిగింది. క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం ఇవాళ సాయంత్రం మరోసారి వీరి పెళ్లి జరుగుతుంది.
News December 12, 2024
ఇందిరా ఎమర్జెన్సీని తలపించేలా అరెస్టులు: KTR
TG: తాండూరులోని గిరిజన హాస్టల్లో అస్వస్థతకు గురైన బాలికలను పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌ను అరెస్ట్ చేయడం దారుణమని కేటీఆర్ అన్నారు. పసిబిడ్డలకు కనీసం ఆహారం పెట్టలేని అమానవీయ ప్రభుత్వం అరెస్టుల పేరుతో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తలపిస్తోందని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలను అడ్డుకోవడం కాకుండా విద్యార్థులకు పోషకాహారం అందించడంపై దృష్టి పెట్టాలని కోరారు.
News December 12, 2024
BREAKING: వైసీపీకి మరో షాక్
AP: వైసీపీకి మరో కీలక నేత గుడ్‌బై చెప్పారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈమేరకు రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపారు. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీని <<14855229>>వీడిన<<>> విషయం తెలిసిందే.