News April 11, 2024

మా అన్నయ్య స్కిల్స్ నేర్పించారు.. అందుకే ఇక్కడ నిలబడ్డా: పవన్

image

AP: తన అన్నయ్య చిరంజీవి మార్షల్ ఆర్ట్స్, నటన అనే స్కిల్స్ నేర్పించడం వల్లే ఇవాళ తాను ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నానని పవన్ చెప్పారు. ‘ఆ స్కిల్స్ నన్ను కోట్ల మంది ముందు నిలబెట్టాయి. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తే యువత సొంతంగా సంపాదించుకుంటారు. అందుకే యువత నైపుణ్యాలు మెరుగుపర్చేలా కష్టపడుతున్నాం. సంక్షేమ పథకాలూ ఏవీ ఆపం. మరో పది రూపాయలు ఎక్కువే ఇస్తాం’ అని హామీనిచ్చారు.

Similar News

News February 12, 2026

నేటి సామెత: కొబ్బరి చెట్లకు కుడితిమిత్తి

image

కొబ్బరి మొక్కకు వృథాగా పారబోసే కుడితిని నీరుగా పోసి పెంచితే, అది పెద్దయ్యాక మనకు ఎన్నో కాయలను అందించి ఆ రుణాన్ని తీర్చుకుంటుంది. చిన్నతనంలో మనం చేసిన చిన్న సహాయానికి లేదా పెట్టిన పెట్టుబడికి ఆ చెట్టు భవిష్యత్తులో అంతకంటే ఎక్కువ ప్రతిఫలాన్ని మనకు తిరిగి అందిస్తుంది. అలాగే చిన్నప్పుడు పిల్లలకు మంచి సంస్కారం, విద్యను అందిస్తే వారు పెద్దయ్యాక తల్లిదండ్రులను గౌరవంగా చూసుకుంటారని ఈ సామెత చెబుతుంది.

News February 12, 2026

శివ నామాలు అర్థాలు ‘‘శంకర’’

image

‘శం’ అంటే అనంతమైన సుఖం/శాంతి అని అర్థం. ‘కర’ అంటే కలిగించేవాడు. ఎవరైతే తనను నమ్ముకున్న భక్తులకు, ఈ చరాచర జగత్తుకు శాంతిని, ఆనందాన్ని ప్రసాదిస్తారో ఆయనే శంకరుడు. మానవ జీవితంలో ఎదురయ్యే అశాంతిని దూరం చేసి, మనసును నిర్మలం చేసే దైవం ఆయన. లోక కల్యాణం కోసం నిరంతరం తపించేవాడు కాబట్టే ఆయనను దర్శించుకున్నా, స్మరించుకున్నా మనకు తెలియని ఓ ప్రశాంతత లభిస్తుంది. సర్వ ప్రాణులకు శుభాన్ని కలిగించే మంగళకారి ఆయన.

News February 12, 2026

బడ్జెట్ సమావేశాలు.. వ్యూహాలపై వైసీపీ చర్చ

image

AP: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ వైసీపీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించనుంది. మ.3 గంటలకు తాడేపల్లిలో పార్టీ చీఫ్ జగన్ అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ కానున్నారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. నిన్న అసెంబ్లీకి వెళ్లిన జగన్ అన్ని రోజులూ హాజరవుతారా అనేది ఆసక్తికరంగా మారింది.