News March 31, 2025
ఆ విషయంలో నాన్నే స్ఫూర్తి: బాలకృష్ణ

ప్రతి సినిమాలో వేరియేషన్ ఉండేలా చూసుకునేవాడినని సీనియర్ హీరో బాలకృష్ణ అన్నారు. ఆదిత్య 369 రీరిలీజ్ నేపథ్యంలో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. తన నాన్న నందమూరి తారకరామారావు స్ఫూర్తితో కొత్తదనం కోసం ప్రయత్నించేవాడినని చెప్పారు. అదే కోవలో ఆదిత్య 369 చేసేందుకు ఒప్పుకున్నట్లు తెలిపారు. సెకండ్ ఇన్నింగ్స్ అనే మాట తన ఒంటికి పడదని చెప్పారు. కాగా ‘ఆదిత్య 369’ ఏప్రిల్ 4న రీరిలీజ్ కానుంది.
Similar News
News April 21, 2025
బీటెక్, MBA చేసినా నిరుద్యోగులుగానే!

భారతదేశంలో గ్రాడ్యుయేట్ల పరిస్థితిపై ‘అన్‌స్టాప్’ నివేదిక విడుదల చేసింది. దాదాపు 83% మంది ఇంజినీరింగ్ విద్యార్థులు, 50శాతం మంది MBA గ్రాడ్యుయేట్లు ఎలాంటి ఉద్యోగం, ఇంటర్న్‌షిప్ పొందలేదని తెలిపింది. 2024లో ఇంటర్న్‌షిప్ పొందిన వారిలోనూ నలుగురిలో ఒకరిని ఫ్రీగా పనిచేయించుకున్నట్లు పేర్కొంది. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచే విధంగా విద్యా సంస్థలు కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
News April 21, 2025
త్వరలో తులం బంగారం రూ.1.25 లక్షలు?

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం కారణంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ యుద్ధం మరింత తీవ్రమైతే 2025 చివరినాటికి బంగారం ధర ఔన్స్‌కు $4500కి చేరుకోవచ్చని ప్రముఖ ట్రేడ్ దిగ్గజం ‘గోల్డ్‌మన్ సాచ్స్’ పేర్కొంది. ఔన్స్ ధర $4500 అయితే భారత మార్కెట్లో 10 గ్రాముల బంగారం రూ.1.25 లక్షలకు చేరుకుంటుంది. కాగా, ఇవాళ తొలిసారి బంగారం రూ.లక్షను టచ్ చేసిన విషయం తెలిసిందే. SHARE IT
News April 21, 2025
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు షాక్

వరుస ఓటములతో ఇబ్బందుల్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పక్కటెముకల నొప్పితో బాధపడుతున్న ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ ఈనెల 24న RCBతో జరిగే మ్యాచుకు దూరమయ్యారు. ప్రస్తుతం ఆయన గాయం నుంచి కోలుకుంటున్నారని, జట్టుతో బెంగళూరుకు వెళ్లకుండా జైపూర్‌లోని హోమ్ బేస్‌లో ఉంటారని RR ధ్రువీకరించింది. భవిష్యత్తు మ్యాచుల్లో ఆడతారా? లేదా? అన్నది సంజూ కోలుకోవడంపై ఆధారపడి ఉంటుందని తెలిపింది.