News April 3, 2024
నాకిష్టమైన కోస్టార్ అతనే: మృణాల్ ఠాకూర్

తనతో నటించిన వారిలో తనకు ఇష్టమైన కోస్టార్ దుల్కర్ సల్మాన్ అని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అన్నారు. ‘ఫ్యామిలీ స్టార్’ ప్రమోషన్ ఈవెంట్‌లో ఆమె మాట్లాడారు. ‘సీతారామం’ షూటింగ్ సమయంలో దుల్కర్ అడుగడుగునా ధైర్యానిచ్చారని తెలిపారు. ఆయన వల్లే సీత పాత్ర చేయగలిగానని చెప్పారు. పలు భాషల్లో నటిస్తున్నానంటే కారణం దుల్కర్ ఇచ్చిన స్ఫూర్తి అని పేర్కొన్నారు.
Similar News
News February 9, 2026
అంబటి రాంబాబుకు బెయిల్

AP: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో YCP నేత అంబటి రాంబాబుకు బెయిల్ వచ్చింది. ఈ కేసులో ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే మరో కేసులో ఇవాళ మధ్యాహ్నం స్పెషల్ జుడీషియల్ కోర్టు అంబటికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో మొదటి కేసులో బెయిల్ లభించినా ఆయన జైలు నుంచి బయటికి వచ్చే అవకాశం లేకుండా పోయింది. అటు రాష్ట్రవ్యాప్తంగా అంబటిపై 52 కేసులు నమోదైనట్లు సమాచారం.
News February 9, 2026
రెండేళ్లలో ఇద్దరు పిల్లలు.. తల్లులపై తీవ్ర ప్రభావం

వెంటవెంటనే ఇద్దరు పిల్లలను కనడం తల్లులపై తీవ్ర శారీరక, మానసిక ఒత్తిడికి కారణమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ నుంచి శరీరం పూర్తిగా కోలుకోకముందే మరోసారి గర్భం దాల్చడం వలన అలసట, రక్తహీనత, నిద్రలేమి, డిప్రెషన్ పెరుగుతుందని చెబుతున్నారు. ఇద్దరి పిల్లల మధ్య కనీసం 18 నెలల నుంచి 3 ఏళ్ల గ్యాప్ ఉంటే తల్లి ఆరోగ్యంగా ఉండటంతో పాటు తోబుట్టువుల మధ్య బాండ్ బలంగా ఉంటుందని సూచిస్తున్నారు.
News February 9, 2026
అర్ధరాత్రి వింత అనుభవం: సుధా చంద్రన్

నటి, డాన్సర్ సుధా చంద్రన్ పూనకానికి సంబంధించిన <<18761618>>వీడియో<<>> కొద్ది రోజుల క్రితం వైరల్ అయిన నేపథ్యంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించారు. గతంలోనూ తనకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయన్నారు. గుజరాత్‌లో ఓ షూటింగ్ సమయంలో తనపై ఓ శక్తి దాడి చేసినట్లు చెప్పారు. అర్ధరాత్రి గదిలో నిద్రపోతుండగా ఛాతీ బరువుగా అనిపించిందని, చేతులు కదలలేదన్నారు. చివరకు భక్తితో దేవుని నామస్మరణ చేయడంతో ఉపశమనం కలిగిందన్నారు.


