News January 31, 2025

ప్రెసిడెంట్‌పై అమ్మకు ఎంతో గౌరవం ఉంది: ప్రియాంక

image

ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ముపై సోనియా గాంధీ ‘పూర్ థింగ్’ <<15319555>>కామెంట్స్‌ను<<>> మీడియా వక్రీకరించిందని ఎంపీ, సోనియా కూతురు ప్రియాంకా గాంధీ అన్నారు. ‘ముర్ము చాలా పెద్ద ప్రసంగం చేశారని, ఆమె అలసిపోయి ఉండొచ్చని మాత్రమే అన్నారు. దాన్నే పూర్ థింగ్‌గా అభివర్ణించారు. కానీ మీడియా వక్రీకరణతో అర్థమంతా మారిపోయింది. నా తల్లికి 78 ఏళ్లు. ప్రెసిడెంట్‌పై ఆమెకెంతో గౌరవం ఉంది. కించపరచాలనే ఉద్దేశం లేదు’ అని వివరించారు.

Similar News

News November 27, 2025

వారికి నిద్ర అవసరం: సుందర్ పిచాయ్

image

‘జెమిని 3’ మోడల్‌ కోసం తన బృందం కొన్ని వారాల పాటు విరామం లేకుండా పని చేసిందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ‘ఉద్యోగులంతా ఎంతో అలసిపోయారు. కొందరికి నిద్ర అవసరం. ఇప్పుడు తగిన విశ్రాంతి దొరుకుతుందని ఆశిస్తున్నా’ అని చెప్పారు. ‘గూగుల్ ఏఐ: రిలీజ్ నోట్స్’ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడారు. జెమిని 3 ఏఐ మోడల్‌ను ఇటీవల గూగుల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

News November 27, 2025

నిర్మాతలను బ్లేమ్ చేయొద్దు: SKN

image

కంఫర్ట్ కోసం ఎక్కువ ఖర్చు చేస్తూ ప్రొడ్యూసర్స్‌‌ను బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని ప్రేక్షకులనుద్దేశించి నిర్మాత SKN పేర్కొన్నారు. ‘మనం కంఫర్ట్, లగ్జరీ కావాలి అనుకున్నప్పుడే ఎక్కువ పే చేయాలి. కేవలం కంఫర్ట్ కోసమే ఎక్స్‌ట్రా చెల్లిస్తున్నాం. లగ్జరీ థియేటర్లో చూడాలంటే రియల్‌ఎస్టేట్ వాల్యూ ప్రకారం టికెట్, రిఫ్రెష్‌మెంట్ రేట్లుంటాయి. వాటితో నిర్మాతకొచ్చే ఎక్స్‌ట్రా బెనిఫిట్ ఏమీ ఉండదు’ అని తెలిపారు.

News November 27, 2025

ఈనెల 29న ఆన్‌లైన్ జాబ్ మేళా

image

AP: పార్వతీపురం ఎంప్లాయిమెంట్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఈ నెల 29న ఆన్‌లైన్ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా HDB ఫైనాన్స్ కంపెనీలో 41 బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనున్నారు. 18ఏళ్లు పైబడిన డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. జాబ్ మేళా రిజిస్ట్రేషన్ లింక్: https://forms.gle/vtBSqdutNxUZ2ESX8