News January 31, 2025
ప్రెసిడెంట్‌పై అమ్మకు ఎంతో గౌరవం ఉంది: ప్రియాంక

ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ముపై సోనియా గాంధీ ‘పూర్ థింగ్’ <<15319555>>కామెంట్స్‌ను<<>> మీడియా వక్రీకరించిందని ఎంపీ, సోనియా కూతురు ప్రియాంకా గాంధీ అన్నారు. ‘ముర్ము చాలా పెద్ద ప్రసంగం చేశారని, ఆమె అలసిపోయి ఉండొచ్చని మాత్రమే అన్నారు. దాన్నే పూర్ థింగ్‌గా అభివర్ణించారు. కానీ మీడియా వక్రీకరణతో అర్థమంతా మారిపోయింది. నా తల్లికి 78 ఏళ్లు. ప్రెసిడెంట్‌పై ఆమెకెంతో గౌరవం ఉంది. కించపరచాలనే ఉద్దేశం లేదు’ అని వివరించారు.
Similar News
News February 13, 2025
NCA జిమ్‌లో బుమ్రా.. ఫొటో వైరల్

వెన్నునొప్పి కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన బుమ్రా బెంగళూరు NCAలో పునరావాసం పొందుతున్నారు. తాజాగా జిమ్‌లో ఉన్న ఫొటోను ఈ స్టార్ బౌలర్ షేర్ చేస్తూ ‘రీబిల్డింగ్’ అని రాసుకొచ్చారు. దీంతో ఈ ఫొటో వైరలవుతోంది. త్వరగా కోలుకుని ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు అందుబాటులోకి రావాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా బుమ్రా స్థానంలో వరుణ్ చక్రవర్తిని బీసీసీఐ CTకి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
News February 13, 2025
మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన

మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం ఉత్తర్వులిచ్చింది. ఇటీవలే CM బీరెన్ సింగ్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మణిపుర్‌లో మైతేయి, కుకీ వర్గాల మధ్య మే 2023 నుంచి ఘర్షణలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. అయితే CM ఓ వర్గానికి కొమ్ము కాస్తున్నారని సొంత పార్టీ MLAలే విమర్శించారు. విశ్వాస పరీక్ష జరిగితే MLAలు విప్‌ను ధిక్కరించే అవకాశం ఉండటంతో బీజేపీ అధిష్ఠానం సూచనతో ఆయన తప్పుకున్నారు.
News February 13, 2025
కొత్త రూల్స్.. లేటైతే డబుల్ ఛార్జ్

FEB 17 నుంచి కొత్త FASTag రూల్స్ అమల్లోకి రానున్నాయి. FASTagలో తగిన బ్యాలెన్స్ లేకపోవడం, KYC పెండింగ్, ఛాసిస్, వెహికల్ నంబర్లు వేర్వేరుగా ఉంటే FASTag బ్లాక్‌లిస్టులోకి వెళ్తుంది. టోల్ గేటుకు చేరుకునే సమయానికి 60min కంటే ఎక్కువ టైం FASTag ఇన్‌యాక్టివ్, బ్లాక్ లిస్టులో ఉంటే ఎర్రర్ చూపుతుంది. స్కాన్ చేసిన 10 min తర్వాత ఇన్‌యాక్టివ్‌లోకి వెళ్లినా ఆ లావాదేవీ తిరస్కరిస్తారు. అప్పుడు డబుల్ టోల్ కట్టాలి.