News July 26, 2024

నా ప్రదర్శన సంతృప్తికరంగా లేదు: గిల్

image

టీ20ల్లో తన వ్యక్తిగత ప్రదర్శన ఊహించినంతగా లేదని టీమ్ఇండియా వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ అన్నారు. అంచనాలను అందుకోలేకపోతున్నానని చెప్పారు. 2026 టీ20 వరల్డ్ కప్‌కు ముందు 30-40 T20లు ఆడుతామని, అప్పటిలోపు మరింత మెరుగయ్యేందుకు కృషి చేస్తానన్నారు. జైస్వాల్‌తో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తున్నట్లు తెలిపారు. రైట్, లెఫ్ట్ కాంబినేషన్‌తో మంచి భాగస్వామ్యం నమోదు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.

Similar News

News November 26, 2025

రంగారెడ్డి జిల్లాలో త్వరలో కొలువుదీరనున్న కొత్త పాలకవర్గాలు

image

2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించగా పదవీకాలం 2024 జనవరితో ముగిసింది. అప్పటి నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. దీంతో RR జిల్లాలో సర్పంచులు, వార్డ్ మెంబర్లు లేకపోవడంతో గ్రామాల్లో ఎక్కడికక్కడ సమస్యలు పేరుకుపోయాయి. దీనికి తోడు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సైతం అందకపోవడంతో అభివృద్ధి పనులకు ఇబ్బందులు తప్పలేదు. నొటిఫికేషన్ రావడంతో త్వరలో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి.

News November 26, 2025

బాలిస్టిక్ క్షిపణి పరీక్షించిన పాకిస్థాన్

image

యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు పాకిస్థాన్ మిలిటరీ ప్రకటించింది. ‘స్థానికంగా నిర్మించిన నేవల్ ప్లాట్‌ఫామ్ నుంచి మిస్సైల్ పరీక్షించాం. సముద్రం, భూమిపై ఉన్న లక్ష్యాలను ఇది అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. ఇందులో అత్యాధునిక గైడెన్స్ వ్యవస్థలు ఉన్నాయి’ అని పేర్కొంది. కాగా మే నెలలో భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాతి నుంచి పాకిస్థాన్ ఈ తరహా ప్రయోగాలను పెంచింది.

News November 26, 2025

పుల్లోరం వ్యాధితో కోళ్లకు ప్రమాదం

image

వైరస్, సూక్ష్మజీవుల వల్ల కోళ్లలో పుల్లోరం వ్యాధి సోకుతుంది. కోడి పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువ. తల్లి నుంచి పిల్లలకు గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. రోగం సోకిన కోడిపిల్లలు గుంపులుగా గుమికూడటం, శ్వాసలో ఇబ్బంది, రెక్కలు వాల్చడం, మలద్వారం వద్ద తెల్లని రెట్ట అంటుకోవడం వంటి లక్షణాలుంటాయి. కోడిని కోసి చూస్తే గుండె, కాలేయం, పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు వెటర్నరీ డాక్టర్ సలహాలను పాటించాలి.