News July 26, 2024
నా ప్రదర్శన సంతృప్తికరంగా లేదు: గిల్

టీ20ల్లో తన వ్యక్తిగత ప్రదర్శన ఊహించినంతగా లేదని టీమ్ఇండియా వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ అన్నారు. అంచనాలను అందుకోలేకపోతున్నానని చెప్పారు. 2026 టీ20 వరల్డ్ కప్‌కు ముందు 30-40 T20లు ఆడుతామని, అప్పటిలోపు మరింత మెరుగయ్యేందుకు కృషి చేస్తానన్నారు. జైస్వాల్‌తో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తున్నట్లు తెలిపారు. రైట్, లెఫ్ట్ కాంబినేషన్‌తో మంచి భాగస్వామ్యం నమోదు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.
Similar News
News November 19, 2025
రాష్ట్రపతి పర్యటన.. రేణిగుంటలో విస్తృత తనిఖీలు

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరుపతి పర్యటనను దృష్టిలో పెట్టుకుని రేణిగుంట పట్టణంలో భద్రతా చర్యలను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఉన్నాధికారుల ఆదేశాల మేరకు బుధవారం పోలీసులు పట్టణంలోని లాడ్జీలు, హోటళ్లలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. అతిథుల నమోదు, సీసీ కెమెరాలు, భద్రతా పరికరాలను పరిశీలించి, అనుమానాస్పద వ్యక్తులపై వివరాలు సేకరించారు. లాడ్జ్ నిర్వాహకులు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వారు సూచించారు.
News November 19, 2025
ఆ భయంతోనే ఛత్తీస్‌గఢ్ నుంచి ఏపీకి!

లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఎక్కడ తమ వివరాలు బయటపెడతారేమోనని మిగతా నేతలు భయపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అనేక మంది ఛత్తీస్‌గఢ్ నుంచి APకి వచ్చి తలదాచుకుంటున్నారని సమాచారం. ఎలాంటి భయం లేకుండా లొంగిపోవడానికి రావాలని, తాము రక్షణ కల్పిస్తామని ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా చెప్పారు. అటు హిడ్మాను పట్టుకుని కాల్చి చంపినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. హిడ్మా ఎన్‌కౌంటర్‌లోనే చనిపోయాడన్నారు.