News May 11, 2024

నా రెండో సంతకం LTA రద్దుపైనే: చంద్రబాబు

image

AP: ఇంటి వద్ద పెన్షన్‌లు ఇవ్వకుండా జగన్ శవ రాజకీయాలు చేశాడని చంద్రబాబు దుయ్యబట్టారు. ‘అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛను రూ.4వేలకు పెంచి ఏప్రిల్ నెల నుంచే అందిస్తాం. మీ భూమి మీరు అమ్ముకోవడానికి లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపొందించారు. దీని ద్వారా ప్రజల భూములు కొట్టేసే కుట్ర చేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక మెగా DSCపై తొలి సంతకం, LT చట్టం రద్దుపై రెండో సంతకం చేస్తా’ అని తెలిపారు.

Similar News

News December 28, 2024

నేడు మన్మోహన్ అంత్యక్రియలు

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను ఇవాళ ఉదయం 11.45 గంటలకు ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో జరగనున్నాయి. సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. తొలుత మన్మోహన్ పార్థీవ దేహాన్ని ఆయన నివాసం నుంచి AICC కార్యాలయానికి తరలిస్తారు. అక్కడ ప్రజల సందర్శనార్థం కొద్దిసేపు ఉంచి నిగమ్‌బోధ్ ఘాట్‌కు తీసుకెళ్తారు.

News December 28, 2024

రెండు పార్టులుగా VD12 మూవీ: నాగవంశీ

image

గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ నటిస్తున్న VD12 మూవీ రెండు పార్ట్‌లుగా రాబోతోందని నిర్మాత నాగవంశీ వెల్లడించారు. అయితే రెండు పార్టుల్లో వేర్వేరుగా కథ ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం తొలి భాగం 80 శాతం షూటింగ్ పూర్తయ్యిందన్నారు. మార్చిలో మూవీ విడుదలకు ప్లాన్ చేస్తున్నామని, ఒకవేళ హరిహరవీరమల్లు రిలీజ్ ఉంటే వాయిదా వేస్తామని చెప్పారు.

News December 28, 2024

TG టెట్ అభ్యర్థులకు కీలక సూచనలు

image

JAN 2 నుంచి 20 వ‌ర‌కు టెట్ పరీక్ష జరగనుంది. ఉ.9 నుంచి 11.30 వ‌ర‌కు, మ‌.2 నుంచి 4.30 వ‌ర‌కు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. అభ్యర్థులను గంటన్నర ముందే పరీక్ష కేంద్రంలో అనుమతిస్తారు. ఎగ్జామ్ ప్రారంభానికి 15 నిమిషాల ముందే గేట్ల‌ను క్లోజ్ చేస్తారు. అభ్య‌ర్థులు త‌ప్ప‌నిస‌రిగా హాల్ టికెట్‌తో పాటు బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్, గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల‌కు అనుమ‌తి లేదు.