News May 11, 2024

నా రెండో సంతకం LTA రద్దుపైనే: చంద్రబాబు

image

AP: ఇంటి వద్ద పెన్షన్‌లు ఇవ్వకుండా జగన్ శవ రాజకీయాలు చేశాడని చంద్రబాబు దుయ్యబట్టారు. ‘అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛను రూ.4వేలకు పెంచి ఏప్రిల్ నెల నుంచే అందిస్తాం. మీ భూమి మీరు అమ్ముకోవడానికి లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపొందించారు. దీని ద్వారా ప్రజల భూములు కొట్టేసే కుట్ర చేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక మెగా DSCపై తొలి సంతకం, LT చట్టం రద్దుపై రెండో సంతకం చేస్తా’ అని తెలిపారు.

Similar News

News February 10, 2025

రాజ్‌ ఠాక్రేతో ఫడణవీస్ భేటీ

image

MNS చీఫ్ రాజ్‌ఠాక్రేతో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ భేటీ అయ్యారు. ఫడణవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఇద్దరు నేతలు సమావేశమవడం ఇదే తొలిసారి. MHలో కొద్దిరోజుల్లో స్థానికసంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇరుపార్టీల మధ్య పొత్తు ఉండొచ్చనే చర్చ నడుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో మహాయుతికి మద్దతిచ్చిన MNS తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి ఖాతా తెరవలేకపోయింది.

News February 10, 2025

నాన్నా.. నువ్వు చనిపోతున్నావా అని అడిగాడు: సైఫ్

image

తనపై దాడి జరిగినప్పుడు ఇంట్లో పరిస్థితిపై సైఫ్ అలీఖాన్ వివరించారు. ‘చిన్నకొడుకు జెహ్ రూమ్‌లోకి ప్రవేశించిన దుండగుడిని అడ్డుకోగా నాపై కత్తితో దాడి చేశాడు. వెంటనే కరీనా, తైమూర్ వచ్చారు. నాన్న నువ్వు చనిపోతున్నావా అని తైమూర్ అమాయకంగా అడగ్గా, లేదని చెప్పా. కరీనా కొందరికి కాల్ చేసినా ఎవరూ లిఫ్ట్ చేయలేదు. అప్పుడు వారు చాలా భయపడ్డారు. అనంతరం తైమూర్‌తో కలిసి ఆస్పత్రికెళ్లా’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

News February 10, 2025

పార్టీ ఫిరాయింపు పిటిషన్లపై విచారణ వాయిదా

image

TG: ఫిరాయింపు <<15413173>>ఎమ్మెల్యేలపై<<>> అనర్హత వేటు వేయాలని KTR‌తో సహా పలువురు బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఒకరు ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారని కేటీఆర్ తరఫు న్యాయవాది వాదించారు. అనంతరం విచారణను ఈ నెల 18కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది.

error: Content is protected !!