News March 6, 2025

ఫైనల్లో నా సపోర్ట్ న్యూజిలాండ్‌కే‌: డేవిడ్ మిల్లర్

image

CT సెమీస్‌లో దక్షిణాఫ్రికా ఓటమికి ఇండియానే కారణమని సౌతాఫ్రికా ప్లేయర్ డేవిడ్‌ మిల్లర్ ఆరోపించారు. అస్తవ్యస్త పర్యటన వల్ల ప్రాక్టీస్ చేసే సమయం లేదన్నారు. భారత్ పాక్‌లో ఆడకపోవడం వల్లే తాము ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వచ్చిందని అసహనం వ్యక్తం చేశారు. ఛాంఫియన్స్ ట్రోఫీ పైనల్‌లో తన మద్దతు న్యూజిలాండ్‌కేనని తెలిపారు. NZతో జరిగిన రెండో సెమీస్‌లో మిల్లర్ సెంచరీ చేసినప్పటికీ దక్షిణాఫ్రికా గెలవలేదు.

Similar News

News March 6, 2025

ప్రభాస్‌కు గాయం? టీమ్ ఏం చెప్పిందంటే..

image

స్టార్ హీరో ప్రభాస్‌‌ కాలికి గాయమైందని, కొద్ది రోజుల పాటు సినిమా షూటింగ్‌లకు దూరమవుతారని జరుగుతున్న ప్రచారంపై ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది. ప్రభాస్‌‌కు ఎలాంటి గాయం కాలేదని, అసత్య ప్రచారాలు వ్యాప్తి చేయొద్దని కోరింది. కాగా ప్రభాస్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందపడటంతో తీవ్ర గాయమైందని, ఇటలీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని పలు సైట్లు వార్తలు ప్రచురించాయి.

News March 6, 2025

రోడ్డు ప్రమాదాలకు ఇంజినీర్లే కారణం: గడ్కరీ

image

రోడ్డు ప్రమాదాలకు సివిల్ ఇంజినీర్ల తప్పులే కారణమని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. డీపీఆర్, రోడ్డు డిజైన్లు సరిగా చేయట్లేదని, దీనివల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని చెప్పారు. మన దేశంలో రోడ్ సిగ్నల్స్, మార్కింగ్ సిస్టమ్స్ లాంటి చిన్న పనులు కూడా అధ్వానంగా ఉన్నాయని పేర్కొన్నారు. మనం స్పెయిన్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ నుంచి నేర్చుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

News March 6, 2025

నాకౌట్ మ్యాచుల్లో కుల్దీప్ ఫెయిల్.. మరో బౌలర్‌ను తీసుకోవాల్సిందేనా?

image

టీమ్ ఇండియా ప్రధాన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో అంతగా రాణించట్లేదు. అతడి రికార్డులు 2023 వన్డే WC సెమీఫైనల్లో 1/56, ఫైనల్లో 0/56, 2024 టీ20 WC సెమీఫైనల్లో 3/19, ఫైనల్లో 0/45, CT-2025 సెమీఫైనల్లో 0/44గా ఉన్నాయి. ఆదివారం జరిగే ఫైనల్లో కుల్దీప్ స్థానంలో అర్ష్‌దీప్ లేదా హర్షిత్ రాణాను తీసుకోవాలని పలువురు విశ్లేషకులు సూచిస్తున్నారు. మీరేమంటారు?

error: Content is protected !!