News March 6, 2025
ఫైనల్లో నా సపోర్ట్ న్యూజిలాండ్‌కే: డేవిడ్ మిల్లర్

CT సెమీస్‌లో దక్షిణాఫ్రికా ఓటమికి ఇండియానే కారణమని సౌతాఫ్రికా ప్లేయర్ డేవిడ్ మిల్లర్ ఆరోపించారు. అస్తవ్యస్త పర్యటన వల్ల ప్రాక్టీస్ చేసే సమయం లేదన్నారు. భారత్ పాక్‌లో ఆడకపోవడం వల్లే తాము ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వచ్చిందని అసహనం వ్యక్తం చేశారు. ఛాంఫియన్స్ ట్రోఫీ పైనల్‌లో తన మద్దతు న్యూజిలాండ్‌కేనని తెలిపారు. NZతో జరిగిన రెండో సెమీస్‌లో మిల్లర్ సెంచరీ చేసినప్పటికీ దక్షిణాఫ్రికా గెలవలేదు.
Similar News
News March 26, 2025
ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

TG: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు నిన్నటితో ముగిశాయి. ఇప్పటికే కొన్ని పేపర్ల వాల్యుయేషన్ ప్రారంభమైంది. అన్ని పేపర్లు మూల్యాంకనం చేసిన తర్వాత ఏప్రిల్ 4వ వారంలో ఫలితాలు విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. వచ్చే నెల 29న ఎప్‌సెట్ ఉండటంతో దానికి 2, 3 రోజులు ముందుగానే రిజల్ట్స్ రిలీజ్ చేయాలని యోచిస్తున్నారు. ఈ ఏడాది దాదాపు 10 లక్షల మంది ఇంటర్ పరీక్షలకు హాజరైన విషయం తెలిసిందే.
News March 26, 2025
ఓట్ల కోసమే విభజన రాజకీయం: యోగి

భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో కొంతమంది దేశంలో విభజనలను సృష్టిస్తున్నారని UP CM యోగి ఆదిత్యనాథ్ అన్నారు. వాక్ స్వాతంత్ర్యం పేరుతో ఇతరులను కించపరచడం సరికాదని చట్టం వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఓట్ల కోసమే ప్రాంతం, భాష పేరుతో ప్రాంతాల మధ్య విభేదాలు తెస్తున్నారని, యూపీలో తెలుగు, తమిళ భాషలు నేర్చుకుంటున్నప్పుడు తమిళనాడులో హిందీ నేర్చుకుంటే తప్పేంటి అని యోగి ప్రశ్నించారు.
News March 26, 2025
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

గత 5 రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.100 పెరిగి రూ.81,950లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.110 పెరగడంతో రూ.89,400 వద్ద కొనసాగుతోంది. అటు వెండి ధర రూ.1000 పెరగడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,11,000గా ఉంది.