News April 24, 2024
ప్రజల వైపు ఉండటం నా ధోరణి: విజయశాంతి

TG: కాంగ్రెస్ నేత విజయశాంతి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ప్రభుత్వం వైపు కన్నా.. ప్రజల వైపు ఉండటం నాకు ఓ ధోరణి. తిరుగుబాటు స్వభావపు సినిమా పాత్రల ప్రేరణే అందుకు కారణం కావచ్చు. ప్రతిపక్షంలో ఉన్నంత పోరాట స్ఫూర్తి అధికారపక్షంలో సాధ్యపడకపోవడం కూడా ఒక వాస్తవమేమో తెలియదు. అయితే నేను గెలిపించడానికి పని చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశలను నెరవేర్చే సాఫల్యతను సాధించాలని కోరుకుంటున్నా’ అని ఆమె తెలిపారు.
Similar News
News November 28, 2025
గంగాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇల్లంతకుంట వాసి మృతి

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డుపై ఆరబోసిన వడ్ల కుప్పపైకి ద్విచక్ర వాహనం ఎక్కి కిందపడడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తెనుగువానిపల్లెకు చెందిన రవీందర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 28, 2025
సర్పంచ్ పదవి కోసమే పెళ్లి.. చివరకు!

TG: సర్పంచ్ అయ్యేందుకు హుటాహుటిన పెళ్లి చేసుకొని బోల్తా పడిన ఓ వ్యక్తిని నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు. కరీంనగర్(D) నాగిరెడ్డిపూర్ సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో సర్పంచ్ అవ్వడం కోసం ముచ్చె శంకర్ వెంటనే నల్గొండ(D)కు చెందిన మహిళను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. మొన్న పెళ్లి జరగ్గా ఓటర్గా దరఖాస్తు చేయడంలో ఆలస్యం అయింది. ఆలోపే నోటిఫికేషన్ రావడంతో అతనికి నిరాశే మిగిలింది.
News November 28, 2025
నాన్-ఏసీ కోచ్ల్లోనూ దుప్పటి, దిండు

రైలు ప్రయాణికులకు సదరన్ రైల్వే శుభవార్త చెప్పింది. 2026 జనవరి 1 నుంచి నాన్-ఏసీ స్లీపర్లో కూడా దుప్పటి, దిండు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. ఇందుకోసం ప్రయాణికులు నిర్ణీత ఛార్జీలు చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు రూ.50, రూ.30, రూ.20లలో మూడు ప్యాకేజీలు తీసుకొచ్చింది. ఈ సౌకర్యాన్ని చెన్నై డివిజన్ ఎంపిక చేసిన 10 రైళ్లలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తోంది.


