News May 20, 2024
నా టాప్-3 ఫేవరెట్ ఫిల్మ్స్ ఇవే: కాజల్
బ్రహ్మోత్సవం, సీత, సత్యభామ సినిమాలు తన టాప్-3 ఫేవరెట్ చిత్రాలని హీరోయిన్ కాజల్ అన్నారు. ‘సత్యభామ’ మూవీ ప్రమోషన్లలో ఆమె మాట్లాడారు. బాబు పుట్టిన 2 నెలలకే ‘ఇండియన్-2’ చిత్రం కోసం హార్స్ రైడింగ్ నేర్చుకోవాల్సి వచ్చిందన్నారు. ఆ సమయంలో చాలా పెయిన్ అనుభవించానని తెలిపారు. సత్యభామ సినిమా డేట్స్ విషయంలో డైరెక్టర్ శంకర్ సపోర్ట్‌గా నిలిచారని చెప్పుకొచ్చారు.
Similar News
News December 6, 2024
విజయసాయికి బొలిశెట్టి కౌంటర్
APకి చంద్రబాబు నాయకత్వం వహించలేరని, పవన్ ముందుకు రావాలని <<14805109>>VSR<<>> చేసిన ప్రతిపాదనపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు. ’74 ఏళ్ల గాంధీజీ క్విట్ ఇండియాతో యావత్ దేశాన్ని స్వాతంత్ర్య ఉద్యమం వైపు నడపగా లేనిది CBN APని లీడ్ చేయలేరా? బుర్ర పెట్టి ఆలోచించండి. APని ఎవరు పాలించాలో ప్రజలు నిర్ణయిస్తారు. అది మీ పని కాదు. చేసిన తప్పు ఒప్పుకొని జైలుకెళ్లి శిక్ష అనుభవించి రండి’ అని Xలో కౌంటర్ ఇచ్చారు.
News December 6, 2024
పుష్ప-2 ALL TIME RECORD
అల్లు అర్జున్ పుష్ప-2 మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసేలా కలెక్షన్లు కొల్లగొడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ పొందిన ఈ సినిమా తొలిరోజు నైజాంలో ఆల్ టైం రికార్డు సాధించింది. తాజా PR లెక్కల ప్రకారం ఏకంగా రూ.25 కోట్లకు పైగా రాబట్టింది. దీంతో గతంలో ఉన్న అన్ని రికార్డులు బ్రేక్ అయ్యాయని సినీ వర్గాలు వెల్లడించాయి. రానున్న రోజుల్లో పుష్ప రాజ్ మాస్ జాతర ఎక్కడ ఆగుతుందో చూడాలి మరి.
News December 6, 2024
మళ్లీ ఆదుకున్న నితీశ్ రెడ్డి
పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను ఆదుకున్న తెలుగు ఆటగాడు నితీశ్ రెడ్డి, అడిలైడ్ టెస్టులోనూ ఆపద్బాంధవుడయ్యారు. 3 సిక్సులు, 3 ఫోర్లతో 54 బంతుల్లో 42 రన్స్ చేసి జట్టు స్కోరును 180 పరుగులకు చేర్చారు. పింక్ బాల్ స్వింగ్ అవుతుండటంతో మేటి బ్యాటర్లు చేతులెత్తేసినా నితీశ్ టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం. భారత్‌కు సరైన ఆల్‌రౌండర్ దొరికాడంటూ నెట్టింట నితీశ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.