News March 29, 2024
నాది విజన్.. జగన్‌ది పాయిజన్: చంద్రబాబు

AP: తనది విజన్ అని.. సీఎం జగన్‌ది పాయిజన్ అని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. ‘ఇప్పటివరకు జగన్ పరదాల చాటున తిరిగారు. ఇప్పుడు ప్రజల్లోకి వస్తుంటే వారు పారిపోతున్నారు. ఎవరో కట్టిన దానికి జగన్ రిబ్బన్ కటింగ్ చేస్తారు. వైసీపీ పాలనలో అన్నివర్గాలూ నష్టపోయాయి. తాడేపల్లి ప్యాలెస్ నుంచి కంటైనర్లలో డబ్బులు తరలిస్తున్నారు. ఆ డబ్బుతో ఓట్లు కొనాలని అధికార పార్టీ భావిస్తోంది’ అని ఆయన మండిపడ్డారు.
Similar News
News February 10, 2026
చెరకు రసంతో కాంతివంతమైన చర్మం

చర్మకాంతిని పెంచడంలో చెరకురసం ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. * చెరకు రసంలో కొద్దిగా ముల్తానీ మట్టి కలిపి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి పట్టించి, పావుగంట తర్వాత కడిగేస్తే నల్లమచ్చలు తొలగిపోతాయి. * చెరకు రసంలో కొద్దిగా తేనె కలిపి, ముఖానికి మసాజ్ చేసి, 10నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మృదువుగా మారుతుంది. * కాఫీపొడికి కాస్త చెరకురసాన్ని చేర్చి స్క్రబ్‌లా ఉపయోగిస్తే చర్మం కాంతులీనుతుంది.
News February 10, 2026
వ్యవసాయంలో విత్తనశుద్ధితో ప్రయోజనాలు

వ్యవసాయంలో విత్తనశుద్ధి చేయడం వల్ల.. విత్తనాలు, నేల ద్వారా ఆశించే తెగుళ్లు, పురుగుల నుంచి పంటను సంరక్షించవచ్చు. మొక్కలలో మొలకశాతం పెరుగుతుంది. పంట తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగుల బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. మొక్కలు ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొని పెరుగుతాయి. విత్తనాలు త్వరగా మొలకెత్తి ఏకరీతిగా ఎదుగుతాయి. శుద్ధి చేయడం వల్ల విత్తనాలను ఎక్కువకాలం నిల్వ చేయవచ్చు.
News February 10, 2026
ఏపీలో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు రూ.2,279 కోట్లు: కేంద్రం

AP: రాష్ట్రంలోని బ్యాంకుల్లో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు రూ.2,279 కోట్లు ఉన్నాయని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. టీడీపీ ఎంపీ హరీశ్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ డబ్బును అసలైన యజమానులకు లేదా వారి వారసులకు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. <<18520571>>‘మీ సొమ్ము- మీ హక్కు’<<>> కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 34వేల ఖాతాలకు చెందిన రూ.161 కోట్లను సెటిల్ చేశామని చెప్పారు.


