News April 20, 2024

నా భార్యకు టాయిలెట్‌ క్లీనర్‌ కలిపిన ఆహారం ఇస్తున్నారు: ఇమ్రాన్

image

తన భార్య బుష్రా బీబీకి టాయిలెట్ క్లీనర్‌ కలిపిన ఆహారాన్ని ఇస్తున్నారని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ప్రస్తుతం ఆయన రావల్పిండిలోని జైల్లో ఉండగా, బీబీ గృహనిర్బంధంలో ఉన్నారు. ‘విషపూరిత ఆహారం కారణంగా బీబీ పొట్టలో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. తనకు ఏమైనా అయితే నేను బతికున్నంతకాలం జనరల్ అసీం మునీర్‌ను వదిలిపెట్టేది లేదు’ అని ఇమ్రాన్ పేర్కొన్నట్లు ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్ తెలిపింది.

Similar News

News January 25, 2026

కేంద్ర బడ్జెట్‌: సంప్రదాయాలు, చరిత్ర విశేషాలు

image

స్వాతంత్ర్యం తర్వాత తొలి బడ్జెట్‌ను 1947లో RK షణ్ముఖం చెట్టి ప్రవేశపెట్టారు. 2017 నుంచి Feb 1న సమర్పిస్తున్నారు. ఒకప్పుడు సా.5 గంటలకు ప్రవేశపెట్టే విధానం, 1999 నుంచి ఉ.11కు అమల్లోకి వచ్చింది. బడ్జెట్ ప్రింటింగ్ ప్రారంభానికి సూచికగా హల్వా కార్యక్రమం, అనంతరం ‘లాక్-ఇన్’ పీరియడ్‌ స్టార్టవుతుంది. అంటే అధికారులకు బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. 2019 నుంచి బ్రీఫ్‌కేస్ స్థానంలో ఎర్రటి సంచిని ప్రవేశపెట్టారు.

News January 25, 2026

రూట్ సరికొత్త రికార్డు

image

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్(POTM)లు నెగ్గిన ఇంగ్లండ్ ప్లేయర్‌గా జో రూట్ నిలిచారు. ఇవాళ శ్రీలంకతో మ్యాచులో అవార్డు అందుకోవడంతో ఈ రికార్డు చేరుకున్నారు. రూట్ 27 POTMలు అందుకోగా పీటర్సన్(26), బట్లర్(24), బెయిర్ స్టో(22), స్టోక్స్(21) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కాగా ఓవరాల్‌గా అత్యధిక POTMలు అందుకున్న జాబితాలో సచిన్(76), కోహ్లీ(71), జయసూర్య(58) ముందు వరుసలో ఉన్నారు.

News January 25, 2026

16 రోజుల డిజిటల్ అరెస్ట్.. రూ.14 కోట్లు స్వాహా

image

డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ NRI దంపతుల నుంచి ఏకంగా రూ.14.84 కోట్లను సైబర్ నేరగాళ్లు కాజేశారు. తాము CBI, పోలీసులమని చెప్పి నకిలీ అరెస్ట్ వారెంట్ చూపించి ఢిల్లీలో నివసిస్తున్న 77 ఏళ్ల మహిళ, ఆమె భర్తను 16 రోజుల పాటు వీడియో కాల్‌లో నిరంతరం నిఘా పెట్టారు. భయంతో బాధితులు తమ పెట్టుబడుల నుంచి డబ్బును వారికి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ కేసులో GJ, UP, ఒడిశా రాష్ట్రాల్లో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.