News April 8, 2025

3600 దాటిన మయన్మార్ మృతుల సంఖ్య

image

మయన్మార్ భూకంప విలయంలో మృతుల సంఖ్య 3600 దాటింది. భవనాల శిథిలాల్ని తొలగించే పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా భారీ వర్షాలు, ఈదురుగాలులు వస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అక్కడి అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుతానికి 5017మంది గాయాలతో ఉండగా 160మంది గల్లంతయ్యారని పేర్కొన్నారు.

Similar News

News April 8, 2025

నేడు, రేపు వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

image

తెలంగాణలో ఇవాళ, రేపు ఉమ్మడి వరంగల్, KMM, నల్గొండ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు అల్పపీడనం ప్రభావంతో ఇవాళ, రేపు APలో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద నిలబడవద్దని సూచించింది.

News April 8, 2025

ఆ రూల్‌ మార్చాలి.. భారత క్రికెటర్ అసహనం

image

MI, RCB మ్యాచ్‌‌పై IND క్రికెటర్ విహారి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘RCB ఇన్నింగ్స్ లాస్ట్ బాల్‌కు జితేశ్‌శర్మను అంపైర్ LBWగా ప్రకటించారు. రివ్యూ తీసుకోగా నాటౌట్‌ అని తేలింది. ఆ బంతికి పరుగు తీసినా రూల్ కారణంగా కౌంట్ అవ్వలేదు. ఒకవేళ రెండో ఇన్నింగ్స్‌లో లాస్ట్ బాల్‌‌కు 2 రన్స్ చేయాల్సిన సమయంలో ఇలా జరిగితే పరిస్థితేంటి? అంపైర్ నిర్ణయంతో ఫలితం మారేది. ఇప్పటికైనా ఈ రూల్ మార్చాలి’ అని అసహనం వ్యక్తం చేశారు.

News April 8, 2025

ముంబై పర్యటనకు కందుల దుర్గేశ్

image

AP: పర్యాటక శాఖలో పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కందుల దుర్గేశ్ ఈ నెల 9, 10 తేదీల్లో ముంబైలో పర్యటించనున్నారు. పోవై లేక్‌లో జరిగే దక్షిణాసియా 20వ హోటల్ ఇన్వెస్ట్‌మెంట్ కాన్ఫరెన్స్ వర్క్‌షాప్‌లో పాల్గొననున్నారు. ఆతిథ్య రంగంలో పెట్టుబడుల అవకాశాలు, రాయితీలు వంటివి వివరించి ఇన్వెస్టర్లను ఆహ్వానించనున్నారు. మంత్రితో పాటు పర్యాటక శాఖ సెక్రటరీ అజయ్ జైన్, టూరిజం ఎండీ ఆమ్రపాలి వెళ్లనున్నారు.

error: Content is protected !!