News February 4, 2025
అంతుచిక్కని వ్యాధి.. 15 రోజుల్లో 40 లక్షల కోళ్లు మృతి

AP: అంతుచిక్కని వ్యాధి దెబ్బకు పౌల్ట్రీ పరిశ్రమ కుదేలవుతోంది. ఉభయగోదావరి జిల్లాల్లో 450 వరకు పౌల్ట్రీలు ఉండగా, 15 రోజుల్లోనే 40 లక్షలకు పైగా కోళ్లు మృత్యువాత పడినట్లు అంచనా. ఒక్కో కోడి మరణంతో సగటున రూ.300 వరకు నష్టం వస్తోందని రైతులు వాపోతున్నారు. కోళ్ల మరణాలకు కారణాలపై అధికారులు సైతం స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపామని, నివేదిక రావాల్సి ఉందని చెబుతున్నారు.
Similar News
News November 24, 2025
వరంగల్ కలెక్టరేట్లో గ్రీవెన్స్ రద్దు

పరిపాలనాపరమైన కారణాల వల్ల సోమవారం కలెక్టరేట్లో నిర్వహించాల్సిన గ్రీవెన్స్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ప్రకటించారు. జిల్లా ప్రజలు వినతిపత్రాలతో కలెక్టరేట్‌కు రావొద్దని ఆమె సూచించారు. జిల్లా ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని, తదుపరి కార్యక్రమాన్ని తెలియజేస్తామని ఆమె వివరించారు.
News November 24, 2025
వాట్సాప్ హ్యాక్.. ఇలా చేయండి!

TG మంత్రులు, కొంతమంది ప్రజల <<18366823>>వాట్సాప్ గ్రూపులు<<>>, అకౌంట్లు హ్యాకవడంతో సైబర్ క్రైమ్ అధికారులు జాగ్రత్తలు సూచించారు. ‘వెంటనే www.whatsapp.com/contactలో, 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. యాప్ అన్ఇన్స్టాల్ చేసి మళ్లీ ఇన్స్టాల్ చేసుకోవాలి. 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేయాలి. ఫోన్ ఓవర్ హీట్, బ్యాటరీ త్వరగా డిశ్చార్జ్ అవుతుంటే ఫోన్ హ్యాక్ అయినట్లే. వెంటనే ఫోన్‌ను రీసెట్ చేయాలి’ అని సూచిస్తున్నారు.
News November 24, 2025
జమ్మూ టూరిజంపై ఢిల్లీ బ్లాస్ట్ ఎఫెక్ట్!

పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జమ్మూ టూరిజాన్ని ఢిల్లీ బ్లాస్ట్ మరోసారి ఇబ్బందుల్లోకి నెట్టింది. వింటర్ సీజన్ కావడంతో టూరిజం కార్యకలాపాలపై CM ఒమర్ అబ్దుల్లా సహా ట్రావెల్ ఏజెంట్లూ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇటీవల జరిగిన ఢిల్లీ బాంబుదాడితో టూరిస్టుల్లోనూ భయం నెలకొంది. పైగా దాడిలో కశ్మీర్ మూలాలున్న ఇద్దరిని NIA అరెస్టు చేసింది. ఇది మరోసారి జమ్మూ టూరిజంపై ఎఫెక్ట్ పడేలా చేసింది.


