News February 4, 2025
అంతుచిక్కని వ్యాధి.. 15 రోజుల్లో 40 లక్షల కోళ్లు మృతి

AP: అంతుచిక్కని వ్యాధి దెబ్బకు పౌల్ట్రీ పరిశ్రమ కుదేలవుతోంది. ఉభయగోదావరి జిల్లాల్లో 450 వరకు పౌల్ట్రీలు ఉండగా, 15 రోజుల్లోనే 40 లక్షలకు పైగా కోళ్లు మృత్యువాత పడినట్లు అంచనా. ఒక్కో కోడి మరణంతో సగటున రూ.300 వరకు నష్టం వస్తోందని రైతులు వాపోతున్నారు. కోళ్ల మరణాలకు కారణాలపై అధికారులు సైతం స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపామని, నివేదిక రావాల్సి ఉందని చెబుతున్నారు.
Similar News
News February 12, 2025
కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు.. ఇవి తీసుకెళ్లండి!

TG: కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసే వారు మీసేవ సెంటర్లకు తమ కుటుంబసభ్యుల ఆధార్ కార్డులతో పాటు కరెంట్ బిల్లులను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఇదివరకే రేషన్ కార్డు ఉండి ఫ్యామిలీలోని ఇతరుల పేర్లను జత చేయాలనుకుంటే ఆధార్ కార్డులు ఇవ్వాలి. ఇప్పటికే ప్రజాపాలన, ప్రజావాణిల్లో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజు రూ.50. అంతకంటే ఎక్కువ తీసుకుంటే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.
News February 12, 2025
వాట్సాప్‌లో మరిన్ని సేవలు అందుబాటులోకి

AP: వాట్సాప్ గవర్నెన్స్‌కు ప్రాధాన్యం కల్పిస్తూ మరిన్ని కొత్తసేవలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. కాకినాడలోని అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో వ్రతాలు, దర్శన టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 9552300009 నంబర్‌కు Hi అని మెసేజ్ చేస్తే ఆన్లైన్ చెల్లింపుల ద్వారా టికెట్లు ఇవ్వనుంది. ఇప్పటికే శ్రీశైలం, సింహాచలం, ద్వారకా తిరుమల, కాణిపాకం వంటి క్షేత్రాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
News February 12, 2025
నేడే VD12 టీజర్.. ఎడిటర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తోన్న ‘VD12’ నుంచి ఈరోజు టీజర్ రిలీజ్ కానుంది. ఈక్రమంలో దీనిపై మరింత హైప్ పెంచేలా నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘గౌతమ్ నుంచి ఇలాంటిది ఊహించలేదు. VD12 టీజర్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. గత రెండేళ్లుగా మేము సృష్టించిన ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకెళ్తాయి. వాయిస్, మ్యూజిక్ అదిరిపోతాయి’ అని పేర్కొన్నారు.