News February 21, 2025

అంతుచిక్కని వ్యాధి.. చనిపోతున్న కోళ్లు

image

TG: వనపర్తి జిల్లా కొన్నూరులోని ఓ ఫాంలో 3 రోజుల్లో 2,500 కోళ్లు మృత్యువాత పడటం కలకలం రేపుతోంది. కోళ్లు చనిపోయిన ప్రాంతాన్ని సందర్శించిన అధికారులు, శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు. ఈనెల 16న 117, 17న 300, మిగతా కోళ్లు 18న చనిపోయాయని వెల్లడించారు. 19న శాంపిల్స్ సేకరించి పంపామన్నారు. 5,500 సామర్థ్యం కలిగిన ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ప్రీమియం ఫాంలో ఈ కోళ్లు చనిపోయాయని తెలిపారు.

Similar News

News March 19, 2025

శుభ ముహూర్తం (19-03-2025)

image

☛ తిథి: బహుళ పంచమి రా.8.58 వరకు తదుపరి షష్టి ☛ నక్షత్రం: విశాఖ సా.5.44 వరకు తదుపరి అనురాధ☛ శుభ సమయం: లేదు ☛ రాహుకాలం: మ.12.00 నుంచి 1.30 వరకు ☛ యమగండం: ఉ.7.30 నుంచి 9.00 వరకు ☛ దుర్ముహూర్తం: ఉ.11.36 నుంచి 12.24 వరకు ☛ వర్జ్యం: రా.10.05నుంచి 11.49వరకు ☛ అమృత ఘడియలు: ఉ.7..52 నుంచి 9.39 వరకు

News March 19, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News March 19, 2025

యుద్ధం ముగింపుకు అంగీకరించిన పుతిన్ : వైట్‌హౌస్

image

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు పుతిన్ అంగీకరించినట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. రష్యా అధ్యక్షుడితో ట్రంప్ ఫోన్‌లో చర్చలు జరిపారు. ఈమేరకు యుద్ధానికి స్వస్థి పలకాలని విజ్ఞప్తి చేయగా పుతిన్ అంగీకరించినట్లు శ్వేతసౌధం తెలిపింది. గత కొంతకాలంగా యుద్ధం ముగింపుకు అమెరికా అధ్యక్షుడు ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.

error: Content is protected !!