News February 4, 2025

వన్డే జట్టులోకి మిస్టరీ స్పిన్నర్

image

ఇంగ్లండ్‌తో ఈ నెల 6న ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని BCCI సెలక్ట్ చేసింది. 15మందితో జట్టును ఇప్పటికే ప్రకటించగా 16వ ప్లేయర్ యాడ్ అయ్యారు. ఇటీవల ముగిసిన T20 సిరీస్‌లో వరుణ్ 7.66RRతో 14 వికెట్లు తీశారు. ఫామ్‌లో ఉన్న వరుణ్‌ ఈ సిరీస్‌‌లో రాణిస్తే CTకి సైతం ఎంపిక చేయాలని BCCI భావిస్తోంది. చక్రవర్తిని CTకి ఎంపిక చేయాలని సీనియర్ ప్లేయర్లు సూచించిన విషయం తెలిసిందే.

Similar News

News April 19, 2026

రాత్రి ఆలస్యంగా తింటే ఏమవుతుందో తెలుసా?

image

రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేస్తే జీవక్రియ మందగించి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ‘శరీరంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఇవి రక్తనాళాల్లో పేరుకుపోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. బరువు పెరుగుతారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరగడంతో డయాబెటిస్ రావొచ్చు. నిద్రపోవడానికి కనీసం 2-3 గంటల ముందే భోజనం ముగించాలి’ అని సూచిస్తున్నారు.

News April 19, 2026

HYD: వైభవంగా గురు తేగ్‌ బహదూర్‌ ప్రకాశ్ పురబ్‌

image

తొమ్మిదో సిక్కు గురువు శ్రీగురు తేగ్‌ బహదూర్‌ సాహెబ్‌ జీ 405వ ప్రకాశ్ పురబ్‌ జయంతి వేడుకలు ఆదివారం సీతాఫల్‌మండి గురుద్వారా శ్రీ గురుసింగ్‌ సభ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. చిల్కలగూడలో నిర్వహించిన ‘విశాల్‌ దివాన్‌’లో వందలాది మంది భక్తులు పాల్గొని గురు గ్రంథ్‌ సాహెబ్‌ జీకి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రముఖ రాగీ జాతాల కీర్తనలు, ప్రవచనాలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.

News April 19, 2026

అభిషేక్, నితీశ్ కుమార్‌ల ఫ్యామిలీలను చూశారా?

image

నిన్న ఉప్పల్ స్టేడియంలో CSKతో జరిగిన మ్యాచులో SRH ప్లేయర్లైన అభిషేక్, నితీశ్ కుమార్ రెడ్డి కుటుంబసభ్యులు ఎంజాయ్ చేశారు. వారి తల్లిదండ్రులతో పాటు చెల్లెలు కూడా మ్యాచ్ చూసేందుకు వచ్చారు. అనంతరం అందరూ కలిసి గ్రూప్ ఫొటో తీసుకున్నారు. నితీశ్ సోదరి తేజస్వీ రెడ్డి ఉజ్బెకిస్థాన్‌లో మెడిసిన్ చదువుతున్నారు. అటు అభిషేక్ సోదరి కోమల్ శర్మ ఫిజియోథెరపిస్ట్. గతేడాది వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు.