News November 17, 2024
నాగచైతన్య-శోభిత పెళ్లి శుభలేఖ ఇదేనా?
అక్కినేని నాగచైతన్య-శోభిత ధూళిపాళ వివాహం డిసెంబర్ 4న జరగనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలోనే తాజాగా వారి వెడ్డింగ్ ఇన్విటేషన్ అంటూ ఓ శుభలేఖ వైరల్ అవుతోంది. ఇందులో నాగచైతన్య తరఫున అక్కినేని నాగేశ్వరరావు-అన్నపూర్ణ, దగ్గుబాటి రామానాయుడు-రాజేశ్వరి పేర్లు కూడా ఉన్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్‌లో పెళ్లి జరగనుందని సమాచారం. త్వరలోనే దీనిపై అక్కినేని ఫ్యామిలీ నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Similar News
News December 10, 2024
మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీ: AISF
మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీపై AP ప్రభుత్వం విచారణ చేయించాలని AISF జాతీయ కార్యదర్శి శివారెడ్డి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ‘MBUలో ఫీజుల దోపిడీపై మంచు మనోజ్ స్టేట్‌మెంట్‌ను సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలి. ప్రతి విద్యార్థి దగ్గర ఏటా ₹20,000 అధికంగా వసూలు చేస్తున్నారు. ప్రశ్నించిన పేరెంట్స్‌ను మోహన్ బాబు బౌన్సర్లతో కొట్టిస్తున్నారు. స్టూడెంట్స్‌ను ఫెయిల్ చేయిస్తున్నారు’ అని ఆరోపించారు.
News December 10, 2024
ప్రజా సమస్యల పోరాటంపై తగ్గేదేలే: సజ్జల
AP: ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటామని YCP స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ నేతలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘ప్రజల గొంతుకగా మనం ప్రభుత్వాన్ని నిలదీయాలి. సమస్యలపై సర్కార్ దిగొచ్చేవరకూ బాధితులకు అండగా నిలవాలి. కూటమి ప్రభుత్వంపై కలిసికట్టుగా పోరాడాలి’ అని ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు.
News December 10, 2024
నేను ఏ పార్టీ మారలేదు: ఆర్.కృష్ణయ్య
AP: రాజ్యసభ ఉపఎన్నికల్లో బీజేపీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన ఆర్.కృష్ణయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలోకి వెళ్లలేదని, వాళ్లే పిలిచి టికెట్ ఇచ్చారని చెప్పారు. తాను ఏ పార్టీలో ఉన్నా బీసీల కోసమే పనిచేస్తానని తెలిపారు. కేంద్రంలో బీసీల నాయకత్వమే ఎక్కువని, రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తనకు అవకాశమిచ్చిన మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు.