News August 8, 2024
ఇవాళ హీరోయిన్‌తో నాగచైతన్య ఎంగేజ్‌మెంట్?

అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇవాళ చైతూ, శోభిత నిశ్చితార్థం జరగనున్నట్లు సినీ వర్గాల్లో టాక్. దీనిపై నాగార్జున సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. కాగా స్టార్ హీరోయిన్ సమంతను పెళ్లి చేసుకున్న నాగచైతన్య 2021లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
Similar News
News November 19, 2025
నారాయణపేట: పొగమంచులో ఓవర్‌టేక్ చేయొద్దు: ఎస్పీ

చలికాలంలో ఉదయం రోడ్లపై పొగమంచు పెరుగుతున్నందున రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉందని నారాయణపేట ఎస్పీ వినీత్ వాహనదారులను హెచ్చరించారు. వాహనాల వేగం తగ్గించి, సురక్షిత దూరం పాటించాలని సూచించారు. ముఖ్యంగా, పొగమంచులో ఓవర్‌టేక్ చేయడం పూర్తిగా మానుకోవాలని, జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చని ఆయన స్పష్టం చేశారు.
News November 19, 2025
నయనతారకు రూ.10 కోట్ల విలువైన గిఫ్ట్ ఇచ్చిన భర్త

నయనతార బర్త్‌డే (నవంబర్ 18) సందర్భంగా ఆమె భర్త విఘ్నేశ్ ఖరీదైన బహుమతి ఇచ్చారు. ప్రతి సంవత్సరం లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చే విఘ్నేశ్ ఈ ఏడాది కూడా అదే ట్రెండ్ ఫాలో అయ్యారు. రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్టర్‌ను గిఫ్ట్‌గా ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కారు విలువ రూ.10 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. 2024లో 5Cr విలువైన మెర్సిడెస్ బెంచ్ మేబ్యాక్ జీఎల్‌ఎస్ 600ను గిఫ్ట్‌గా ఇచ్చారు.