News October 9, 2024

నాగార్జునVSసురేఖ: ఈనెల 10న మరో వ్యక్తి వాంగ్మూలం రికార్డు

image

తమ కుటుంబంపై మంత్రి సురేఖ ఆరోపణలను ఖండిస్తూ హీరో నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం దావా కేసు విచారణ ఈనెల 10కి వాయిదా పడింది. ఆరోజు మరో సాక్షి వాంగ్మూలం రికార్డు చేస్తామని నాగ్ తరఫు లాయర్ అశోక్‌రెడ్డి తెలిపారు. అదే రోజు మంత్రికి నోటీసులు జారీ చేసే అవకాశముందన్నారు. అటు నాగార్జున పిటిషన్ నిలబడదని సురేఖ న్యాయవాది తిరుపతివర్మ అన్నారు. ఆయన పిటిషన్‌లో ఒకలా, కోర్టు వాంగ్మూలంలో మరోలా చెప్పారన్నారు.

Similar News

News July 9, 2025

ఆధార్ తొలి గుర్తింపు కాదు: భువనేశ్

image

బిహార్‌ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో నకిలీ ఓట్లను గుర్తించేందుకు ఆధార్‌ను అనుసంధానించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. కాగా ఆధార్ కేవలం ఒక ధ్రువీకరణ మాత్రమేనని, అర్హతకు ప్రాథమిక ఆధారం లేదా గుర్తింపు కాదని UIDAI CEO భువనేశ్ కుమార్ స్పష్టం చేశారు. అటు ఫేక్ ఆధార్ కార్డుల కట్టడికీ మార్గాలు అన్వేషిస్తున్నట్లు తెలిపారు. నకిలీ ఆధార్‌లను గుర్తించే QR కోడ్ స్కానర్ యాప్ అభివృద్ధి చివరి దశలో ఉందన్నారు.

News July 9, 2025

సామ్‌తో రాజ్.. శ్యామలి ఇంట్రెస్టింగ్ పోస్ట్

image

హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నారనే పుకార్ల వేళ వీరిద్దరూ కలిసి ఉన్న <<17000941>>ఫొటో<<>> వైరలైన విషయం తెలిసిందే. ఈక్రమంలో రాజ్ సతీమణి శ్యామలి ఇన్‌స్టా స్టోరీలో ఆసక్తికర సందేశాన్ని పంచుకున్నారు. ‘ఏ మతమైనా మన చర్యలతో ఇతరులను బాధించొద్దని చెబుతుంది. అదే మనం పాటించాల్సిన గొప్ప నియమం’ అని రాసున్న కొటేషన్‌ను ఆమె పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ చర్చనీయాంశమైంది.

News July 9, 2025

షాకింగ్.. పిల్లలకు లెక్కలు రావట్లేదు!

image

దేశంలోని స్కూళ్లలో విద్యార్థుల్లో ఎక్కువ మందికి లెక్కలు(గణితం) రావట్లేదని కేంద్రం సర్వేలో తేలింది. మూడో తరగతి పిల్లల్లో 45% మంది ఆరోహణ, అవరోహణ క్రమాన్ని గుర్తించలేకపోతున్నారని పేర్కొంది. ఆరో తరగతిలో 10 వరకు ఎక్కాలు(టేబుల్స్) వచ్చిన వారు 53% శాతమే. తొమ్మిదిలో గణితంపై అవగాహన ఉన్నవారు ఇంతే శాతమని తెలిపింది. దీని ప్రకారం విద్యార్థుల్లో ప్రతిభను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.