News August 26, 2024
కూల్చివేతతో నాగార్జునకు భారీ నష్టం?
HYD మాదాపూర్‌లోని N-కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చివేయడంతో హీరో నాగార్జున భారీగానే నష్టపోయారనే చర్చ నడుస్తోంది. మొత్తం కన్వెన్షన్ విలువ ₹500 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ఇందులోని 4 హాళ్ల ద్వారా ఫంక్షన్ జరిగిన రోజు ₹50 లక్షల నుంచి కోటి వరకూ, ఏటా ₹100 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుందట. హైడ్రా కూల్చేసిన హాళ్లతో పాటు ఈ సీజన్లో వాటిల్లో జరగాల్సిన <<13935679>>కార్యక్రమాలు<<>> జరగకపోవడంతో ఈ ఆదాయమంతా ఆయన కోల్పోయినట్లే.
Similar News
News September 13, 2024
జ్యోతిషుడు వేణుస్వామికి షాక్
ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి, జర్నలిస్ట్ మూర్తి వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వేణుస్వామిపై కేసు నమోదు చేయాలని జూబ్లీహిల్స్ పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశించింది. ప్రజలను జాతకాల పేరుతో ఆయన మోసం చేస్తున్నారని, ప్రధాని ఫొటోనూ మార్ఫింగ్ చేశారని మూర్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జ్యోతిషుడిపై కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసింది.
News September 13, 2024
ఒంగోలు వైసీపీ నేతలతో బాలినేని భేటీ
AP: ఒంగోలు వైసీపీ నేతలతో మాజీ మంత్రి, వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో భవిష్యత్తు కార్యాచరణపై వారితో సమాలోచనలు జరిపారు. ఈ భేటీలో 20 మంది కార్పొరేటర్లు పాల్గొన్నారు. బాలినేని వైసీపీని వీడుతారనే ప్రచారం సాగుతోంది. కాగా వైసీపీ అధిష్ఠానం సూచనతో పార్టీ నేతలు సతీశ్ రెడ్డి, విడదల రజినీ ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
News September 13, 2024
నిబంధనలు పెట్టకుండా నిధులివ్వండి: రేవంత్
TG: రాష్ట్రంలో సంభవించిన వరదల నష్టానికి ఎలాంటి నిబంధనలు లేకుండా తక్షణ సాయం కింద నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. సెక్రటేరియట్‌లో ఆయన కేంద్ర బృందంతో భేటీ అయ్యారు. వరదల నివారణకు శాశ్వత చర్యలు చేపట్టి, నిధి ఏర్పాటు చేయాలన్నారు. మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మాణం తదితర అంశాలను కేంద్ర బృందం దృష్టికి సీఎం తీసుకెళ్లారు.