News October 3, 2024

కొండా సురేఖకు నాగార్జున లీగల్ నోటీసులు?

image

TG: తన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖకు నటుడు అక్కినేని నాగార్జున నోటీసులు పంపుతారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వైజాగ్‌లో ఉన్నారని, హైదరాబాద్ రాగానే నోటీసులు పంపాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఎంతవరకైనా పోరాడాలని నాగ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే సురేఖకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.

Similar News

News November 15, 2024

IPL: 2 సెట్లుగా టాప్ క్రికెటర్ల వేలం

image

IPL మెగా వేలం Nov 24, 25ల్లో జరగనున్న నేపథ్యంలో ప్రాంఛైజీలు పలువురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. రిటైన్ కానివారు, కొత్త క్రికెటర్లు వేలంలో పాల్గొనున్నారు. అయితే ఈ వేలంలోని టాప్ క్రికెటర్లను 2 సెట్లుగా విభజించినట్లు BCCI తెలిపింది. పంత్, రాహుల్, శ్రేయస్, సిరాజ్, షమీ, అర్ష్‌దీప్, అశ్విన్, స్టార్క్, బట్లర్‌ వంటి ప్లేయర్లు ఈ లిస్టులో ఉంటారు. ప్రతి సెట్లో 8-9 మంది టాప్ క్రికెటర్లుంటారు.

News November 15, 2024

ట్రాఫిక్ విధుల్లో ట్రాన్స్‌జెండర్లు: CM రేవంత్

image

TG: హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్‌జెండర్లను నియమించడంపై దృష్టి సారించాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. తొలిదశలో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వారి సేవలు వినియోగించాలని సూచించారు. హోమ్ గార్డుల తరహాలో ట్రాన్స్‌జెండర్లను నియమించాలని చెప్పారు. డ్రంక్&డ్రైవ్‌ కోసం వారి సేవలను ఉపయోగించుకోవాలన్నారు. వీలైనంత త్వరగా దీన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అదేశించారు.

News November 15, 2024

తెలుగు టైటాన్స్ ఓటమి

image

ప్రోకబడ్డీ లీగ్‌ సీజన్‌-11లో భాగంగా UP యోధాస్‌తో మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ ఓడింది. ఫస్ట్ హాఫ్‌ ముగిసే సమయానికి తెలుగు టైటాన్స్ 20-16తో ఆధిక్యం కనబర్చింది. అయితే ఆ తర్వాత UP ఆటగాళ్లు పుంజుకున్నారు. చివరికి UP 40 పాయింట్లు సాధించగా టైటాన్స్ 34 పాయింట్లకే పరిమితమైంది. మరో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్(32)పై U ముంబా(35) గెలిచింది. పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లో హరియాణా ఉండగా టైటాన్స్ 6వ స్థానంలో ఉంది.