News July 27, 2024

పథకాల పేరు మార్పు: లోకేశ్

image

AP: జగన్ పేరుతో ఏర్పాటు చేసిన పథకాలకు స్వస్తి పలుకుతున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు. జగనన్న అమ్మఒడి-తల్లికి వందనం, జగనన్న విద్యాకానుక-సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర, జగనన్న గోరుముద్ద-డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడిభోజనం, మన బడి నాడు, నేడు-మన బడి, మన భవిష్యత్తు, స్వేచ్ఛ-బాలికా రక్ష, జగనన్న ఆణిముత్యాలు-అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మార్చినట్లు చెప్పారు.

Similar News

News January 20, 2026

HYDలో అమ్మాయిలు భయపడకండి!

image

సిటీలో పోకిరీల ఆటలు సాగనివ్వమని ‘షీ టీమ్స్’ మరోసారి ప్రూవ్ చేశాయి. కేవలం వాట్సాప్ టిప్స్‌తో డిసెంబర్‌లో 13 మందిని పట్టుకుంటే, జనవరి నాటికి ఆ జోరు మరింత పెరిగింది. సైబరాబాద్‌లో 127 డెకాయ్ ఆపరేషన్లతో ఏకంగా 59 మంది వేధింపుల రాయుళ్లను జైలుకు పంపారు. ఇదే గ్యాప్‌లో యువత ఫెర్టిలిటీ అవేర్‌నెస్, ఒంటరితనంపై కూడా ‘రియల్ టాక్’ మొదలుపెట్టింది. వేధింపులు ఉంటే 9490616555కు ఫిర్యాదు చేయండి. భయం అస్సలు వద్దు!

News January 20, 2026

తినేటప్పుడు మాట్లాడుతున్నారా? ఈ విషయాలు తెలుసా!

image

ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడితే డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నోటి ద్వారా అధికంగా గాలి పొట్టలోకి చేరి తేన్పులు, గ్యాస్ సమస్యలు రావొచ్చు. ఒక్కోసారి అన్నవాహికలోకి కాకుండా గాలి వెళ్లే గొట్టంలోకి ఆహారం వెళ్లి గొంతునొప్పి, తీవ్రమైన దగ్గు వస్తుంది. ఎక్కువగా తినడంతో బరువు పెరిగే ప్రమాదం ఉంది. సరిగ్గా నమలకపోవడంతో జీర్ణరసాలు ఆహారంలో కలవక అసిడిటీ సమస్యలు తలెత్తుతాయి.

News January 20, 2026

స్థలం చిన్నదైనా ఇంకుడు గుంత తవ్వాలా?

image

స్థలం చిన్నదైనా వాస్తు నియమాలు పాటిస్తూ కనీస సౌకర్యాలు కల్పించుకోవడం సాధ్యమే అంటున్నారు వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు. నీటి వసతి కోసం నిర్మించే సంపు, ఇంకుడు గుంతలను ఈశాన్యం వైపు ఏర్పాటు చేసుకోవాలంటున్నారు. ‘అవసరమైతే గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణాన్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యమైన నిర్మాణానికి ఆటంకం కలగకుండా, ఉన్న స్థలంలోనే శాస్త్రీయంగా వీటిని నిర్మించుకోవడం వల్ల ఇంటికి శుభం కలుగుతుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>