News July 27, 2024

పథకాల పేరు మార్పు: లోకేశ్

image

AP: జగన్ పేరుతో ఏర్పాటు చేసిన పథకాలకు స్వస్తి పలుకుతున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు. జగనన్న అమ్మఒడి-తల్లికి వందనం, జగనన్న విద్యాకానుక-సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర, జగనన్న గోరుముద్ద-డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడిభోజనం, మన బడి నాడు, నేడు-మన బడి, మన భవిష్యత్తు, స్వేచ్ఛ-బాలికా రక్ష, జగనన్న ఆణిముత్యాలు-అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మార్చినట్లు చెప్పారు.

Similar News

News October 12, 2024

జమ్మి ఆకులే ‘బంగారం’!

image

తెలంగాణలో జమ్మి చెట్టు ఆకులను బంగారంలా భావిస్తారు. దసరా రోజు సాయంత్రం జమ్మి చెట్టుకు పూజలు చేసి, ఆకులను ఆత్మీయులకు పంచుతారు. కొందరు పూజగదిలో భద్రపరుస్తారు. కుబేరుడు రఘుమహారాజుకు భయపడి జమ్మిచెట్లున్న ప్రాంతంలో బంగారాన్ని కురిపించాడని, అలా జమ్మి ఆకులను బంగారంగా పిలుచుకుంటారని పురాణాలు చెబుతాయి. జమ్మి చెట్టులోని ప్రతి భాగంలోనూ ఔషధ గుణాలుంటాయి. దీని గాలి పీల్చితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

News October 12, 2024

‘రంజీ ట్రోఫీ’కి ఆ పేరు ఎలా వచ్చింది?

image

నవానగర్ (ప్ర‌స్తుత జామ్‌న‌గ‌ర్‌) గల్ఫ్ ఆఫ్ కచ్ దక్షిణ తీర ప్రాంతం. గ‌తంలో దీన్ని జ‌డేజా రాజ్‌పుత్ రాజ‌వంశీయులు పాలించేవారు. ఇక్కడి రాజును జామ్ సాహెబ్‌గా పిలుస్తారు. న‌వాన‌గ‌ర్‌ను 1907 నుంచి రంజిత్‌సిన్హ్ జీ విభా జీ పాలించారు. ఈయ‌న ప్రపంచ ప్ర‌సిద్ధ క్రికెట్ ఆట‌గాడు. ఇంగ్లండ్ తరఫున ఆడారు. ఈయ‌న పేరు మీదే దేశంలో ఏటా రంజీ ట్రోఫీ జ‌రుగుతుంది. ఈ రాజవంశం నుంచి ఎక్కువ మంది క్రికెటర్లుగా రాణించారు.

News October 12, 2024

DSP యూనిఫాంలో సిరాజ్.. పిక్ వైరల్!

image

భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ డీఎస్పీగా శుక్రవారం ఛార్జ్ తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సిరాజ్‌కు గ్రూప్-1 పోస్టు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ DGPని నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. అప్పుడు సూటు బూటులో ఉన్న సిరాజ్, ఈరోజు డీఎస్పీగా యూనిఫాం ధరించారు. ఆ పిక్స్ ఈరోజు వైరల్ అవుతున్నాయి. ఆల్ ది బెస్ట్ మియా అంటూ నెట్టింట ఆయనకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి.