News September 15, 2024
రెండు రోజులు పోలీస్ కస్టడీకి నందిగం సురేశ్

AP: టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టయిన వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతినిచ్చింది. ఇవాళ మధ్యాహ్నం నుంచి ఈనెల 17న మధ్యాహ్నం వరకు ఆయనను పోలీసులు మంగళగిరి రూరల్ పీఎస్‌లో విచారించనున్నారు. విచారణ సందర్భంగా దూషించడం, భయపెట్టడం, లాఠీ ఛార్జ్ వంటివి చేయవద్దని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
Similar News
News November 21, 2025
లిక్కర్ స్కాం నిందితులకు రిమాండ్ పొడిగింపు

AP: మద్యం కుంభకోణం కేసులో నిందితులకు రిమాండ్ గడువు నేటితో ముగియనుండటంతో అధికారులు విజయవాడ ACB కోర్టుకు తీసుకొచ్చారు. కాగా కోర్టు డిసెంబర్ 5 వరకు రిమాండ్‌ను పొడిగించింది. ఇదే కేసులో YCP ఎంపీ మిథున్ రెడ్డి సైతం కోర్టుకు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో హాజరయ్యేందుకు అనుమతివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తదుపరి విచారణ ఈనెల 24కు వాయిదా పడింది.
News November 21, 2025
రేవంత్ నన్ను అరెస్ట్ చేసే ధైర్యం చేయరు: కేటీఆర్

TG: ఫార్ములా ఈ-రేసు <<18337628>>కేసులో<<>> CM రేవంత్ తనను అరెస్ట్ చేసే ధైర్యం చేయరని KTR అన్నారు. ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ కేసులో ఏమీ లేదని రేవంత్‌కూ తెలుసు. నేను ఏ తప్పు చేయలేదు. లై డిటెక్టర్ టెస్టుకూ సిద్ధమే’ అని మీడియా చిట్‌చాట్‌లో స్పష్టం చేశారు. MLA దానం నాగేందర్‌తో రాజీనామా చేయించాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారని, GHMC ఎన్నికల తర్వాత ఉపఎన్నికలు వస్తాయని పేర్కొన్నారు.
News November 21, 2025
SBI పేరిట వెబ్సైట్.. పైరసీ సినిమాలు ప్రత్యక్షం!

ఎస్బీఐ ఇన్సూరెన్స్ పేరుతో ఉన్న పోర్టల్‌లో పైరసీ సినిమాల లింకులు కనిపించడం కలకలం రేపింది. sbiterminsurance.com పేరిట ఓ పైరసీ వెబ్సైట్ వెలుగుచూసింది. అందులో టర్మ్ ఇన్సూరెన్స్ లాప్స్&రివైవల్ గైడ్ పేజీకి రీడైరెక్ట్ అయి సినిమాలు ప్లే అవుతున్నాయి. దీనిపై SBI టీమ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


