News September 15, 2024
రెండు రోజులు పోలీస్ కస్టడీకి నందిగం సురేశ్
AP: టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టయిన వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతినిచ్చింది. ఇవాళ మధ్యాహ్నం నుంచి ఈనెల 17న మధ్యాహ్నం వరకు ఆయనను పోలీసులు మంగళగిరి రూరల్ పీఎస్‌లో విచారించనున్నారు. విచారణ సందర్భంగా దూషించడం, భయపెట్టడం, లాఠీ ఛార్జ్ వంటివి చేయవద్దని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
Similar News
News October 12, 2024
ఇంకెన్ని కుటుంబాలు నాశనమైతే పాఠాలు నేర్చుకుంటారు?: రాహుల్ గాంధీ
మైసూరు-దర్భంగా రైలు ప్రమాదం నేపథ్యంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నిన్నటి రైలు ప్రమాదం బాలాసోర్ ఘోర ప్రమాదాన్ని గుర్తుచేసింది. లెక్కలేనన్ని ప్రమాదాల్లో భారీ సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఎటువంటి పాఠాలు నేర్చుకోవడం లేదు. జవాబుదారీతనం అనేది పైనుంచే మొదలవుతుంది. ఇంకెన్ని కుటుంబాలు నాశనమైతే ఈ సర్కారు కళ్లు తెరుస్తుంది?’ అని మండిపడ్డారు.
News October 12, 2024
IPL కంటే టెస్టు క్రికెట్‌కే నా ప్రాధాన్యం: కమిన్స్
ఐపీఎల్ వేలంలో అమ్ముడైన తర్వాత టోర్నీ నుంచి తప్పుకొంటే లీగ్ నుంచి రెండేళ్ల పాటు నిషేధం విధించాలన్న నిబంధనను బీసీసీఐ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ పాట్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘నేనెప్పుడూ అలా తప్పుకోలేదు. కానీ నాకు తొలి ప్రాధాన్యం దేశానికి టెస్టులు, ఐసీసీ ట్రోఫీలు ఆడటమే. షెడ్యూల్ బట్టి IPL వంటి టోర్నీలు ఆడాలా వద్దా అని నిర్ణయించుకుంటుంటాను’ అని వెల్లడించారు.
News October 12, 2024
పెరిగిన బంగారం, వెండి ధరలు
దసరా రోజున కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.270 పెరిగి రూ.77,670 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.250 ఎగసి రూ.71,200కి చేరుకుంది. గత రెండు రోజుల్లోనే 10 గ్రాములపై గోల్డ్ ధర రూ.1000కి పైగా పెరిగింది. కేజీ సిల్వర్ ధర రూ.1,000 పెరగడంతో రూ.1,03,000 పలుకుతోంది.