News October 21, 2024

నందిగం సురేశ్‌కు 14 రోజుల రిమాండ్

image

AP: ఓ మహిళ హత్య కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మంగళగిరి కోర్టు నవంబర్ 4 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. 2020లో తుళ్లూరు మండలం వెలగపూడిలో రెండు వర్గాల మధ్య గొడవలో మరియమ్మ అనే మహిళ మరణించారు. సురేశ్ ప్రోద్బలంతోనే ఈ వివాదం జరిగిందనే బంధువుల ఆరోపణలతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News October 17, 2025

జనగణన.. వచ్చేనెల ఇళ్ల లెక్కింపు

image

దేశంలో జనగణన కసరత్తు మొదలైంది. NOV 10-30 మధ్య అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎంపిక చేసిన ఏరియాల్లో హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సస్ చేపట్టనున్నారు. 2027లో జనగణన తొలిదశ జరగనుంది. దేశాభివృద్ధి, ప్రజల పరిస్థితులు తెలుసుకునేందుకు దీన్ని నిర్వహిస్తారు. ఈ గణాంకాల ఆధారంగానే ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలు రూపొందిస్తారు. దేశంలో 1872 నుంచి జనగణన చేస్తుండగా చివరిసారి 2011లో జరిగింది.

News October 17, 2025

విడిపోయినా కలవొచ్చు..

image

హిందూ వివాహ చట్టం-1955, సెక్షన్‌-9 ద్వారా విడిపోయిన భార్యాభర్తలు తిరిగి వివాహ బంధాన్ని పునరుద్ధరింపజేయమని కోరవచ్చు. సెక్షన్‌-10 ప్రకారం బంధం చెడకుండా విడివిడిగా ఉండటానికి న్యాయస్థానం ద్వారా అనుమతి కోరవచ్చు. న్యాయసేవల అధికారిక చట్టం ద్వారా స్త్రీలు, పిల్లలు ఉచిత న్యాయసేవలను పొందొచ్చు. ఎవరైనా మహిళను విచారణ జరిపేటప్పుడు ఆమె నివాసంలో, కుటుంబ సభ్యుల సమక్షంలో జరపాలి.

News October 17, 2025

‘దేవుడివి సామీ’.. మహేశ్‌బాబుపై ప్రశంసలు

image

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు తన ఫౌండేషన్‌ ద్వారా చేయిస్తోన్న ఉచిత గుండె ఆపరేషన్ల సంఖ్య తాజాగా 5వేలకు చేరింది. ఈ విషయాన్ని అభిమానులు పోస్ట్ చేస్తూ ‘దేవుడు’ అంటూ కొనియాడుతున్నారు. వైద్యం చేయించుకోలేని నిరుపేదలు ‘మహేశ్‌బాబు ఫౌండేషన్‌’లో <>నమోదు<<>> చేసుకోవాలని ఆయన అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. రియల్‌ లైఫ్‌ హీరోగా మహేశ్‌బాబు అందిస్తున్న చేయూతకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.