News October 21, 2024

నందిగం సురేశ్‌కు 14 రోజుల రిమాండ్

image

AP: ఓ మహిళ హత్య కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మంగళగిరి కోర్టు నవంబర్ 4 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. 2020లో తుళ్లూరు మండలం వెలగపూడిలో రెండు వర్గాల మధ్య గొడవలో మరియమ్మ అనే మహిళ మరణించారు. సురేశ్ ప్రోద్బలంతోనే ఈ వివాదం జరిగిందనే బంధువుల ఆరోపణలతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News July 10, 2025

కేజ్రీవాల్‌కు నోబెల్.. బీజేపీ VS ఆప్ వార్

image

పరిపాలనలో తనకు నోబెల్ బహుమతి ఇవ్వాలన్న ఆప్ చీఫ్ కేజ్రీవాల్ వ్యాఖ్యలు బీజేపీ, ఆప్ మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. కేజ్రీవాల్ వ్యాఖ్యలు హాస్యాస్పదమని, అవినీతి, అసమర్థతకు కేజ్రీవాల్ మారుపేరని బీజేపీ విమర్శించింది. అవినీతి కేటగిరీలో ఆయన నోబెల్‌కు అర్హుడంటూ ఎద్దేవా చేసింది. మరోవైపు వ్యక్తి నామస్మరణ మాని పాలన, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని BJPకి ఆప్ కౌంటరిచ్చింది.

News July 10, 2025

పిల్లలు ఫోన్ చూస్తున్నారా?

image

దేశంలో 5 ఏళ్ల లోపు చిన్నారులు మొబైల్, TV చూసే విషయంలో గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. WHO ప్రతిపాదనలను మించి రోజుకు 2.2 గంటలు స్క్రీన్ చూస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. దీనివల్ల స్కిల్స్ తగ్గుతాయని, ఊబకాయం పెరుగుతుందని, నిద్ర అలవాట్లు మారి ఆరోగ్యంపై పాడవుతుందని ఆ సర్వే హెచ్చరించింది. కాగా 2 ఏళ్లలోపు పిల్లలు అసలు స్క్రీన్ చూడొద్దని, 2-5 ఏళ్ల వారు రోజుకు గంట మాత్రమే చూడొచ్చని WHO చెబుతోంది.

News July 10, 2025

జిల్లా కలెక్టర్లకు రిజిస్ట్రేషన్ల రద్దు అధికారం

image

AP: అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్ల రద్దు అధికారం జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ యాక్ట్ అమెండ్‌మెంట్-2023 బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో చట్టం అమల్లోకి వచ్చింది. గతంలో ఈ అధికారం కేవలం సివిల్ కోర్టులకు మాత్రమే ఉండేది. దీంతో ఫోర్జరీ డాక్యుమెంట్లు, అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులు పేరుకుపోతుండటంతో ప్రభుత్వం ఈ మార్పులు చేసింది.