News March 18, 2024
నంద్యాల: టెన్త్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ

నంద్యాలలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న పరీక్ష కేంద్రాలను కలెక్టర్ శ్రీనివాసులు, ఎస్పీ రఘువీర్ రెడ్డి సోమవారం తనిఖీ చేశారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల హైస్కూల్, ఎస్పీజీ హైస్కూళ్లను వారు పరిశీలించి మాట్లాడారు. పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయన్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామన్నారు.
Similar News
News January 23, 2026
నిరక్షరాస్యత నిర్మూలనకు కర్నూలు కలెక్టర్ ఆదేశం

కర్నూలు జిల్లాలో గుర్తించిన 1,61,914 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం ‘అక్షరాంధ్ర’, ఫ్యామిలీ సర్వే అంశాలపై ఆమె టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం 16,191 మంది వాలంటీర్లను కేటాయించినట్లు కలెక్టర్ వెల్లడించారు. నిర్దేశించిన లక్ష్యాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఆమె సూచించారు.
News January 22, 2026
బీఈడీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ బీఈడీ నాలుగో సెమిస్టర్ రీవాల్యుయేషన్ ఫలితాలను వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వెంకట బసవరావు గురువారం విడుదల చేశారు. మొత్తం 144 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, కేవలం 28 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు తమ ఫలితాలను విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ https://rayalaseemauniversity.ac.in లో చూసుకోవచ్చని ఆయన సూచించారు.
News January 22, 2026
60 రోజుల్లోపు చార్జ్ షీట్ దాఖలు చేయాలి: జిల్లా ఎస్పీ

కర్నూలు జిల్లాలో నేరాల నియంత్రణకు సాంకేతికతను సమర్థంగా వినియోగించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మహిళల భద్రతకు గట్టి చర్యలు తీసుకోవాలని, డ్రంక్ అండ్ డ్రైవ్, బహిరంగ మద్యపానంపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేస్తూ, పోక్సో కేసుల్లో 60 రోజుల్లోపు చార్జ్ షీట్ దాఖలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.


