News August 31, 2024
నార్త్ అమెరికాలో నాని మూవీ జోరు

నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. నార్త్ అమెరికాలో ఇప్పటికే 1M డాలర్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇప్పటివరకు నాని నటించిన 10 సినిమాలు USAలో $ 1M పైగా వసూళ్లు రాబట్టడం గమనార్హం. కాగా టాలీవుడ్ నుంచి $1M పైగా కలెక్ట్ చేసిన సినిమాల్లో అత్యధికంగా మహేశ్ బాబు ఖాతాలో 12 మూవీలు ఉన్నాయి.
Similar News
News February 8, 2025
‘స్థానిక’ ఎన్నికలు.. 10న ఓటర్ల జాబితా

TG: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు SEC కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని 5,817 MPTC, 570 ZPTC స్థానాల్లోని ఓటర్ల జాబితాను ఈ నెల 10న విడుదల చేయాలని ఉత్తర్వులిచ్చింది. అలాగే ఆయా స్థానాల పరిధిలోని పోలింగ్ స్టేషన్ల వివరాలతో 11న డ్రాఫ్ట్ ప్రకటించాలని ఆదేశించింది. 12, 13న అభ్యంతరాలు స్వీకరించి, 15న తుది జాబితా రిలీజ్ చేయాలని సూచించింది. ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి ఈనెల 15లోగా శిక్షణ <<15393143>>పూర్తిచేయాలంది.<<>>
News February 8, 2025
మేజిక్ ఫిగర్ దక్కేదెవరికో?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. మొత్తం 70 స్థానాలున్న దేశ రాజధానిలో అధికారం చేపట్టాలంటే 36 స్థానాలు గెలుచుకోవాలి. తాము 50 సీట్లతో విజయఢంకా మోగించబోతున్నామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుండగా మూడోసారి అధికారం తమదేనని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతోంది. 2013 వరకు వరుసగా 15 ఏళ్లపాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ ఆ తర్వాత తేలిపోయింది. ఈ సారి కనీసం పరువు కాపాడుకోవాలని ఆరాటపడుతోంది.
News February 8, 2025
టెన్త్ ప్రశ్నపత్రాలపై QR కోడ్

TG: టెన్త్ క్వశ్చన్ పేపర్లపై క్యూఆర్ కోడ్, సీరియల్ నంబర్లను విద్యాశాఖ ముద్రించనుందని సమాచారం. ఎక్కడైనా లీకైతే అవి ఏ సెంటర్ నుంచి బయటికి వచ్చాయో సులభంగా తెలుసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. APలో గత ఏడాదే ఈ విధానం అమలు చేశారు. కాగా ఇంటర్ హాల్‌టికెట్లు విడుదల కాగానే విద్యార్థుల మొబైల్‌కు మెసేజ్ పంపేలా ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది. ఆ లింక్ క్లిక్ చేయగానే హాల్‌టికెట్ రానుంది.