News November 1, 2024

NTR మునిమనవడిపై నారా భువనేశ్వరి ట్వీట్

image

నందమూరి నాలుగో తరం హీరో రామ్‌కు నారా భువనేశ్వరి శుభాకాంక్షలు తెలిపారు. ‘YVS చౌదరి తదుపరి ప్రాజెక్ట్‌తో మా రామ్ తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నాడని తెలుపడానికి సంతోషంగా ఉంది. నా సోదరుడు స్వర్గీయ నందమూరి హరికృష్ణ మనవడిగా, లెజెండరీ ఎన్టీఆర్ గారి మునిమనవడిగా, ఆయన మా కుటుంబ వారసత్వాన్ని గౌరవప్రదంగా ముందుకు తీసుకెళ్తారని నాకు నమ్మకం ఉంది’ అని ట్వీట్ చేశారు.

Similar News

News January 20, 2026

HURLలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

హిందుస్థాన్ ఉర్వరిక్& రసాయన్ లిమిటెడ్ (<>HURL<<>>)లో 38 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, డిప్లొమా, MBA, MSW, పీజీ డిప్లొమా, MBBS, LLB ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్/స్క్రీనింగ్/సెలక్షన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.hurl.net.in/

News January 20, 2026

డిజాస్టర్‌గా ‘రాజాసాబ్’?

image

రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘రాజాసాబ్’ థియేట్రికల్ రన్‌ను డిజాస్టర్‌గా ముగించనుంది. JAN 9న విడుదలైన మూవీ 55% వసూళ్లతో బిజినెస్ క్లోజ్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు తెలిపాయి. థియేటర్లలో 20% ఆక్యుపెన్సీ కూడా ఉండట్లేదని పేర్కొన్నాయి. బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్‌గా నిలిచేందుకు ఇంకా రూ.90కోట్లు(నెట్) రావాలన్నాయి. మరోవైపు OTT డీల్ ఆశించినంత మేర జరగలేదని ప్రొడ్యూసర్ పేర్కొన్నారని చెప్పాయి.

News January 20, 2026

స్కిప్పింగ్‌తో ఎన్నో లాభాలు

image

ప్రతిరోజు స్కిప్పింగ్​ చేయడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందంటున్నారు నిపుణులు. స్కిప్పింగ్​ చేయడం వల్ల కండరాలు పటిష్ఠడతాయి. గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగు పడుతుంది. కాళ్లు, చేతులు, ఇతర అవయవాల మధ్య సమన్వయం చక్కగా కుదురుతుంది. తద్వారా బాడీ బ్యాలెన్స్ పెరుగుతుంది. క్యాలరీలు ఎక్కువ ఖర్చై బాడీ ఫిట్‌గా మారుతుంది. అంతేకాకుండా స్కిప్పింగ్​ చేయడం ద్వారా డోపమైన్​ ఎక్కువగా రిలీజ్​ అవుతుంది.