News November 1, 2024

NTR మునిమనవడిపై నారా భువనేశ్వరి ట్వీట్

image

నందమూరి నాలుగో తరం హీరో రామ్‌కు నారా భువనేశ్వరి శుభాకాంక్షలు తెలిపారు. ‘YVS చౌదరి తదుపరి ప్రాజెక్ట్‌తో మా రామ్ తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నాడని తెలుపడానికి సంతోషంగా ఉంది. నా సోదరుడు స్వర్గీయ నందమూరి హరికృష్ణ మనవడిగా, లెజెండరీ ఎన్టీఆర్ గారి మునిమనవడిగా, ఆయన మా కుటుంబ వారసత్వాన్ని గౌరవప్రదంగా ముందుకు తీసుకెళ్తారని నాకు నమ్మకం ఉంది’ అని ట్వీట్ చేశారు.

Similar News

News December 11, 2024

‘అఖండ2’ నుంచి సాయంత్రం బిగ్ అప్డేట్

image

నందమూరి బాలకృష్ణ హీరోగా ‘అఖండ2’ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై మేకర్స్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇవాళ సాయంత్రం 5.31 గంటలకు రోరింగ్ అప్డేట్ ఇస్తామని ప్రకటించారు. బోయపాటి శ్రీను రూపొందిస్తున్న ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తారు. రామ్ ఆచంట, గోపీ ఆచంట, తేజస్విని నందమూరి సంయుక్తంగా నిర్మిస్తారు. రేపు రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ మూవీ పూజా కార్యక్రమం జరుగుతుందని టాక్.

News December 11, 2024

నో.. నో: రాహుల్‌కు షాకిచ్చిన కేజ్రీవాల్

image

కాంగ్రెస్‌, రాహుల్ గాంధీకి ఆమ్‌ఆద్మీ షాకిచ్చింది. ఢిల్లీ ఎన్నికల్లో హస్తం పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని స్పష్టం చేసింది. సొంత బలంతోనే పోరాడతామని వెల్లడించింది. ‘ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ పొత్తు తుదిదశకు చేరుకుంది. కాంగ్రెస్ 15, ఇండియా కూటమిలోని ఇతర పార్టీలకు 1-2, మిగిలిన వాటిలో ఆప్ పోటీచేస్తుందని సన్నిహిత వర్గాల సమాచారం’ అంటూ ANI చేసిన ట్వీటుకు అరవింద్ కేజ్రీవాల్ పైవిధంగా బదులిచ్చారు.

News December 11, 2024

నటుడు ముస్తాక్ ఖాన్ కిడ్నాప్.. చివరికి!

image

స్త్రీ-2, వెల్‌కమ్ చిత్రాల్లో నటించిన ముస్తాక్ ఖాన్‌ను దుండగులు కిడ్నాప్ చేశారు. గతనెల 20న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘ఓ అవార్డ్ ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయనను కిడ్నాప్ చేసి UP తీసుకెళ్లారు. గన్నుతో బెదిరించి 12 గంటలు టార్చర్ పెట్టారు. అతడి కొడుకుకి ఫోన్ చేసి రూ.కోటి డిమాండ్ చేశారు. ఇంతలో కిడ్నాపర్ల చెర నుంచి ముస్తాక్ తప్పించుకొన్నాడు’ అని ఆయన ఫ్రెండ్ శివమ్ తెలిపారు.