News September 29, 2024

కన్సల్టేటివ్ ఫోరం ఛైర్మన్‌గా నారా లోకేశ్

image

AP: సీఐఐ భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల కాలపరిమితితో పనిచేసే దీనికి ఛైర్మన్‌గా మంత్రి నారా లోకేశ్ వ్యవహరించనున్నారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ప్రభుత్వం, పారిశ్రామికవేత్తల మధ్య అనుసంధానకర్తగా ఇది పనిచేయనుంది. ప్రభుత్వ శాఖలను RTGS శాఖ సమన్వయం చేస్తుంది.

Similar News

News February 5, 2026

థియేటర్లలోకి ‘మీర్జాపూర్’.. రిలీజ్ ఎప్పుడంటే?

image

పాపులర్ వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’ సినిమాగా SEP 4న థియేటర్లలోకి రానుంది. ‘మీర్జాపూర్ ది ఫిల్మ్’ పేరుతో రానున్న ఈ మూవీ సిరీస్‌లోని కొన్ని ముఖ్యమైన పాత్రలతో ఉంటుందని పేర్కొన్నారు. ఖాలీన్ భయ్యా, గుడ్డు పండిట్, మున్నా త్రిపాఠి వంటి పాత్రలు ఉంటాయని తెలిపారు. ఈ కథను పునీత్ కృష్ణ రాయగా గుర్మీత్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని రితేశ్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్ తెరకెక్కిస్తున్నారు.

News February 5, 2026

ట్రక్ & బస్ డ్రైవర్ల కుమార్తెల కోసం స్కాలర్‌షిప్

image

మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ సంస్థ మహీంద్రా సారథి అభియాన్ స్కాలర్‌షిప్ అందిస్తోంది. కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ట్రక్ డ్రైవర్ కుమార్తె అయి, 11వ తరగతి నుంచి డిగ్రీ చదువుతున్న విద్యార్థినులు అర్హులు. ఆదాయం 4 లక్షల్లోపు, 50% మార్కులు సాధించి ఉండాలి. ఈ పథకం ద్వారా పదివేలు అందిస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 10, 2026. వెబ్‌సైట్: <>https://www.buddy4study.com/page/mahindra-saarthi-abhiyaan<<>>

News February 5, 2026

వివేకా కేసులో మినీ ట్రయల్‌కు ఆదేశించలేం: SC

image

YS వివేకానందరెడ్డి హత్య కేసులో ట్రయల్ కోర్టు ఉత్తర్వుల మేరకు CBI దర్యాప్తు కొనసాగించవచ్చని SC పేర్కొంది. మినీ ట్రయల్‌కు ఆదేశించలేమని సునీత వ్యాజ్యంపై స్పష్టం చేసింది. దర్యాప్తు మరో 3, 4 ఏళ్లు పట్టి విచారణ అంతులేకుండా పోతుందని జస్టిస్ సుందరేశ్ వ్యాఖ్యానించారు. ఎవరిని విచారించాలన్న దానిపైనా ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొన్నారు. ఈ కేసులో ట్రయల్ కోర్టు సూచనలతో తదుపరి విచారణ చేస్తున్నట్లు CBI తెలిపింది.