News September 29, 2024
కన్సల్టేటివ్ ఫోరం ఛైర్మన్‌గా నారా లోకేశ్
AP: సీఐఐ భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల కాలపరిమితితో పనిచేసే దీనికి ఛైర్మన్‌గా మంత్రి నారా లోకేశ్ వ్యవహరించనున్నారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ప్రభుత్వం, పారిశ్రామికవేత్తల మధ్య అనుసంధానకర్తగా ఇది పనిచేయనుంది. ప్రభుత్వ శాఖలను RTGS శాఖ సమన్వయం చేస్తుంది.
Similar News
News October 5, 2024
EXIT POLLS: హరియాణాలో కాంగ్రెస్‌దే అధికారం: CNN
హరియాణాలో బీజేపీకి ఎదురుదెబ్బ తగలనుందని CNN ఎగ్జిట్ పోల్స్ తెలిపింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాషాయ పార్టీ 21 సీట్లకే పరిమితం అవుతుందని అంచనా వేసింది. 59 స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్ అధికారం దక్కించుకోనుందని పేర్కొంది. పీపుల్స్ పల్స్ సర్వే కూడా కాంగ్రెస్‌దే అధికారం అని తేల్చి చెప్పింది. రిపబ్లిక్ భారత్-మ్యాట్రిజ్ కూడా కాంగ్రెస్ 55-62, బీజేపీ 18-24 సీట్లు వస్తాయని పేర్కొంది.
News October 5, 2024
Exit Polls: హరియాణాలో కాంగ్రెస్‌దే గెలుపు
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనా వేసింది. 90 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్ 46-50 సీట్లు సాధించనున్నట్టు సర్వే ఫలితాలు అంచనా వేశాయి. అలాగే అధికార బీజేపీకి ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని, ఆ పార్టీకి కేవలం 20-32 సీట్లు దక్కనున్నట్టు సర్వే వెల్లడించింది. కాంగ్రెస్‌కు 45 శాతం ఓట్లు దక్కనున్నట్లు పేర్కొంది.
News October 5, 2024
EXIT POLLS: జమ్మూకశ్మీర్‌లో అధికారం ఎవరిదంటే?
J&K ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ అధికారం చేపట్టే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. NC 33-35, కాంగ్రెస్ 13-15 సీట్లు గెలుచుకుంటాయని పేర్కొంది. బీజేపీ 23-27 స్థానాలకే పరిమితం అవుతుందని తెలిపింది. అయితే మేజిక్ ఫిగర్ 46ను అందుకోలేక INC+NC 35-40 స్థానాలే గెలుస్తాయని దైనిక్ భాస్కర్, 43 సీట్లకే పరిమితమై హంగ్ ఏర్పడొచ్చని NDTV సర్వే వెల్లడించింది.