News June 12, 2024
మంత్రిగా నారా లోకేశ్.. బ్రాహ్మణి ఎమోషనల్ పోస్ట్

ఏపీ మంత్రిగా నారా లోకేశ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా లోకేశ్ సతీమణి బ్రాహ్మణి Xలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘లోకేశ్ మంత్రిగా ప్రమాణం చేశారు. ఇది నేను గర్వపడే, భావోద్వేగానికి గురైన క్షణం. నూతనోత్సాహంతో రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు మంత్రిగా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న మీకు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు.
Similar News
News March 18, 2025
కావలి గ్రీష్మ రాజీనామాకు ఆమోదం

AP: ఏపీ మహిళా కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ పదవికి కావలి గ్రీష్మ ఈ నెల 9న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన పేరును ప్రకటించగానే ఆమె రాజీనామా చేశారు. ఇటీవల ఆమె ఆ కోటాలో MLCగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం గ్రీష్మ రాజీనామాను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
News March 18, 2025
విశాఖ మేయర్ పీఠాన్ని కాపాడుకుంటాం: కన్నబాబు

AP: విశాఖ మేయర్ పీఠంపై <<15799147>>కూటమి కన్నేయడంతో<<>> వైసీపీ అప్రమత్తమైంది. ఇవాళ కార్పొరేటర్లతో ఉత్తరాంధ్ర సమన్వయకర్త కన్నబాబు సమావేశయ్యారు. ఈ భేటీకి 34 మంది హాజరుకాగా, ముగ్గురు రాలేదు. తమ కార్పొరేటర్లను ప్రలోభపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. మేయర్ స్థానాన్ని కాపాడుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. చీప్ పాలిటిక్స్ మానుకోవాలని CBNకు మాజీ మంత్రి అమర్నాథ్ హితవు పలికారు.
News March 18, 2025
రన్యారావు కేసులో వెలుగులోకి కీలక విషయాలు

బంగారం స్మగ్లింగ్ చేస్తూ అరెస్టైన కన్నడ నటి రన్యారావు కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె తన స్నేహితుడు తరుణ్ రాజుతో 26 సార్లు దుబాయ్ వెళ్లినట్లు, ఆ సమయంలోనూ స్మగ్లింగ్ చేసినట్లు DRI కోర్టు విచారణలో పేర్కొంది. ఆ సమయంలో వీరిద్దరూ ఉదయం బయలుదేరి సాయంత్రం తిరిగొచ్చేవారంది. దుబాయ్‌లో రాజు ఆర్థిక లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నట్లు, అతనికి లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు వివరించింది.