News September 25, 2024
విశాఖ పర్యటనకు నారా లోకేశ్
AP: మంత్రి నారా లోకేశ్ ఇవాళ, రేపు విశాఖలో పర్యటించనున్నారు. ఇవాళ సీఐఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో పాల్గొన్న అనంతరం ఆయన పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా పార్టీ కార్యకర్తలు, ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులను లోకేశ్ కలవనున్నారు.
Similar News
News October 14, 2024
జూరాల 5 గేట్లు ఎత్తివేత
కృష్ణా నదిలో మళ్లీ వరద ప్రారంభమైంది. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పెరగడంతో అధికారులు 5 గేట్లు ఎత్తివేశారు. ఇన్‌ఫ్లో 70 వేల క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 74 వేల క్యూసెక్కులుగా ఉంది. జల విద్యుత కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. దిగువకు వదిలిన నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతోంది.
News October 14, 2024
అక్టోబర్ 14: చరిత్రలో ఈ రోజు
1956: బౌద్ధమతం స్వీకరించిన బీఆర్ అంబేద్కర్
1980: సినీ నటుడు శివ బాలాజీ జననం
1981: టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ జననం
1982: కవి సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి మరణం
1994: బొగద సొరంగం పనుల ప్రారంభం
1998: అమర్త్యసేన్‌కు నోబెల్ బహుమతి
2010: సినీ రచయిత సాయి శ్రీహర్ష మరణం
2011: తెలుగు రచయిత జాలాది రాజారావు మరణం
News October 14, 2024
రిలేషన్‌షిప్‌పై శ్రద్ధాకపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
‘స్త్రీ2’ మూవీతో సూపర్ హిట్ అందుకున్న బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ రిలేషన్‌షిప్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘పార్ట్‌నర్‌తో కలిసి గడిపే సమయాన్ని ఇష్టపడతా. అతనితో కలిసి సినిమా చూడటం, డిన్నర్ వంటివి నచ్చుతాయి. పెళ్లి చేసుకున్నామా అనే దాని కంటే సరైన వ్యక్తితో ఉన్నామా? లేదా? అనేదే ముఖ్యం’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈమె బాలీవుడ్ రచయిత రాహుల్‌తో లవ్‌లో ఉన్నారని బీటౌన్‌లో ప్రచారం సాగుతోంది.